- సీఎం సిద్ధరామయ్య
సాక్షి,బెంగళూరు: ఇప్పట్లో నూతన సంక్షేమపథకాలు ఏవీ ప్రవేశపెట్టే ఆలోచన లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టినవి సక్రమంగా అమలు చేస్తే చాలన్నారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 20కు పైగా పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా జరిగిందన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ జరగడం శుభపరిమాణమన్నారు. హై కమాండ్ సూచనల మేరకు తనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు పొరుగురాష్ట్రంల్లో ప్రచారం కోసం వెలుతున్నామని సిద్ధరామయ్య తెలిపారు.