బెంగళూరు: గత బడ్జెట్‌ను పోలిస్తే ఈ బడ్జెట్‌లో విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. విద్యార్థులను చదువు వైపు ప్రోత్సహించే చర్యల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు ‘షూ-భాగ్య’ తప్ప చెప్పుకోదగ్గ పథకాలు ఏవీ ప్రకటించలేదు. మొత్తంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖలకు కలిపి 2015-16 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రూ. 20,100 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయించిన నిధులతో పోలిస్తే (2014-15లో ఈ రంగానికి 21,305 కోట్లు కేటాయించారు.) ఇవి తక్కువే.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తాగునీటి సదుపాయం, శౌచాలయాలు, భవనాల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కోసం రూ.110 కోట్ల కేటాయింపు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక 1,000 పాఠశాలలకు ‘టెలీ ఎడ్యుకేషన్’ సదుపాయం. విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రైవేటు సంస్థల నుంచి ఆర్థిక సహకారం అందుకోవడానికి వీలుగా ‘శాలిగాగి నావు నీవు’ పేరుతో నూతన విధానం అమలు.
{పభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి ఒక జత షూ, రెండు జతల సాక్సులు అందచేస్తారు. దీనివల్ల రాష్ట్రంలోని 54.54 లక్షల మందికి ప్రయోజనం. ఇందు కోసం రూ.120 కోట్లు కేటాయింపు.వంద ప్రాథమిక, వంద మాధ్యమిక, వంద పీయూసీ కళాశాలలకు సోలార్ ఎడ్యుకేషన్ కిట్ల వితరణ. ఈ విద్యా సంస్థల్లో సోలార్ విద్యుత్‌ను ఉపయోగించాలా చేయడం.రాష్ట్రంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి ఈ ఏడాది రూ.5 కోట్లు కేటాయింపు.
విద్యార్థులను ఎంటర్‌పెన్యూర్స్‌గా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా స్వావలంబన పథకం అమలు. ఇందులో సొంతంగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే వారు గతంలో ఉన్నత విద్యను చదవడానికి బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ (ఎడ్యుకేషన్ లోన్)కు సంబంధించి వడ్డీని రీ ఎంబర్స్ చేస్తుంది. {V>Ò$×, పట్టణ ప్రాంత తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి వీలుగా జ్ఞాన ప్రసార కార్యక్రమం అమలు.సైన్సు, పరిశోధన రంగాల్లో విద్యార్థులకు మక్కువ పెంచడానికి వీలుగా విజ్ఞాన సుగుణ కార్యక్రమం అమలు ఇందు కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయింపు.
50,75,100 ఏళ్ల చరిత్ర కలిగిన విద్యాసంస్థల కట్టడాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.10 కోట్లతో ‘హిరిమే-గరిమే’ పథకం అమలు.వందేళ్లు పూర్తి చేసుకున్న మైసూరు విశ్వవిద్యాలయానికి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు.చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణను ఇప్పించడానికి వీలుగా ‘అభ్యాస’ పేరుతో కార్యక్రమం అమలు. ఇందు కోసం రూ.40 కోట్ల నిధులు కేటాయింపు.బెంగళూరు విశ్వవిద్యాలయం ఆవరణంలో నెహ్రూ చింతన కేంద్రం ఏర్పాటుకు రూ.3 కోట్ల నిధులు కేటాయింపు.రాష్ట్రంలో విద్య అభ్యసించడానికి వచ్చే ఇతర దేశాలకు చెందిన విద్యార్థులకు సహకారం అందించడానికి వీలుగా సెంటర్ ఫర్ ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ ఏర్పాటు. చిత్ర కళాపరిషత్‌కు రూ.20 కోట్ల ప్రత్యేక గ్రాంటులను బడ్జెట్‌లో కేటాయించారు.
విద్యపై చిన్నచూపు
Published Sat, Mar 14 2015 12:31 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement