నిర్మల్ జిల్లా కార్యాలయం బోర్డును తయారు చేయించి పరిశీలిస్తున్న స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు
10 లోపు కార్యాలయాల పూర్తి
ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలలో కార్యాలయాలు
ఆదిలాబాద్ కల్చరల్ : నాలుగు జిల్లాల యువజన సర్వీసుల శాఖ కార్యాలయాల ఏర్పాటుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు నాలుగు జిల్లాలకు చెందిన ఫర్నిచర్లు, బోర్డుల ఏర్పాటులను సిద్ధం చేశారు. దీంతోపాటు ఆయా జిల్లాలకు అందించాల్సిన సామగ్రి, దసరా కంటే ముందుగానే సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు జిల్లా బీసీ సంక్షేమ శాఖల ఇన్‌చార్జిగా ఉన్న ఆయన బీసీ సంక్షేమ శాఖలను ఏర్పాటును వేగవంతం చేస్తున్నారు. ఆయా శాఖల బోర్డులను తయారు చేయించారు. జిల్లా కేంద్రంలోని స్టెప్, బీసీ సంక్షేమ కార్యాలయాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల కార్యాలయాలలో కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
కాగా.. నిర్మల్‌లో జిల్లా యువజన సర్వీసుల శాఖ కార్యాలయాన్నీ ఆర్‌అండ్‌బీ రిక్రేషన్ క్లబ్‌లోని రెండు గదులు, మంచిర్యాలలో ఐటీఐ బిల్డింగ్‌లో, ఆసిఫాబాద్‌లో ఎస్టీ బాయ్స్ రెసిడెన్సియల్ హాస్టల్‌లో యువజన సర్వీసుల శాఖ కార్యాలయాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయాల కోసం నిర్మల్‌లో ఆర్‌అండ్‌బీ ఈఈ బిల్డింగ్, మంచిర్యాలలో గుడిపేట జెడీ ్పహెచ్‌ఎస్ భవనం, ఆసిఫాబాద్‌లో ఎస్టీ బాయ్స్ రెసిడెన్సియల్ స్కూల్‌లో రెండు గదులు కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫర్నిచర్లు, సామగ్రిని ఆదివారం ఉదయం తరలించనున్నారు. ఇందులో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు యువజన సర్వీసుల శాఖ సీఈవో, ఇన్‌చార్జి బీసీ సంక్షేమశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అధికారులు సిబ్బంది విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు.