బళ్లారి అర్బన్, న్యూస్‌లైన్ : అవినీతి నిర్మూలన కోసం ప్రజలు ఆమ్‌ఆద్మీ పార్టీలో సభ్యత్యం పొందాలని ఆ పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్ విజయపతి సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక అనంతపురం రోడ్డు ఎంజీ సర్కిస్‌లోని ఎస్.లింగన్న కాంప్లెక్స్ ముందు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 10 నుంచి సుమారు 10-15 బృందాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.
జిల్లా వ్యాప్తంగా 12,000 మంది ఆమ్‌ఆద్మీ పార్టీ సభ్యత్వాన్ని పొందారన్నారు. అవినీతి నిర్మూలన కోసం పోరాడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేపడుతున్న ఉద్యమాల్లో ఐక్యమత్యంగా పోరాడేందుకు సభ్యత్వాన్ని పొందాలన్నారు. వాలంటీర్లు ఎం. హనుమేష్ కుమార్, చంద్రశేఖర్, నిసార్ అహమ్మద్, సాగర్, కమలేష్, ఎంజీ.వెంకటేష్ పాల్గొన్నారు.
‘అవినీతి అంతానికి ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరండి’
Published Thu, Jan 16 2014 5:12 AM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM
Advertisement
Advertisement