రూయా ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య | patient suicide at Ruya hospital | Sakshi
Sakshi News home page

రూయా ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య

Published Sun, Dec 18 2016 1:51 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

patient suicide at Ruya hospital

తిరుపతి: తిరుపతిలోని రూయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి ఆదివారం ఉదయం బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 35 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి బాత్రూంలోకి వెళ్లి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 7 గంటల సమయంలో బాత్రూం శుభ్రం చేయడానికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లిన సమయంలో పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న అతడిని కనుగొన్నారు.

ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు. ఈ సంఘటన ఆస్పత్రిలో కలకలం సృష్టించింది. అతను ఏ వ్యాధితో చికిత్స కోసం వచ్చాడు, ఎక్కడివాడు వంటి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement