డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగ జేఏసీ సోమవారం పెన్‌డౌన్ నిర్వహించింది. అడహక్ ఉద్యోగులకు 2010, 2015 పీఆర్‌సీ అమలు చేయాలని కోరుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో యూనివ ర్సిటీలో పాలన స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీకి పలు పనులపై వచ్చిన విద్యార్థులు అసౌకర్యానికి లోనయ్యారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా మరో పక్క యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంగళవారం కూడా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉద్యోగ జేఏసీ నిర్ణయించింది. అప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పెన్‌డౌన్
Published Mon, Oct 17 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
Advertisement