crc
-
రావులపాలెంలో సినీ నటుల సందడి
రావులపాలెం : రావులపాలెం సీఆర్సీలో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలకు పలువురు సినీ నటులు హాజరుకావడంతో సందడి నెలకొంది. సీఆర్సీ కాట¯ŒS కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ళ భరణితోపాటు కృష్ణ భగవాన్, గౌతంరాజు, కోట శంకరరావు, బొడ్డు రాజుబాబులు ఆఖరి రెండు రోజులు పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీంతో పలువురు వారితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శన చూసిన సినీ నటుడు కృష్ణభగవా¯ŒS మాట్లాడుతూ వచ్చే ఏడాది మంచి హాస్య నాటికను తనికెళ్ళ భరణి రచించాలని, తమంతా ఆ నాటికను ప్రదర్శిస్తామన్నారు. ప్రత్యేక ప్రదర్శన ఇచ్చిన నటులను అభినందించారు. -
సీఆర్సీ కళాసేవ అభినందనీయం
-ఎమ్మెల్యే చిర్ల, నటుడు ఎల్బీ శ్రీరామ్ -రాష్ట్రస్థాయి ఉగాది నాటిక పోటీలు ప్రారంభం రావులపాలెం : అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు సీఆర్సీ కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీ రామ్ ప్రశంసించారు. బుధవారం రాత్రి రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 19వ ఉగాది ఆహ్వాన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. సీఆర్సీ ఏసీ ఆడిటోరియంలో జగ్గిరెడ్డి, శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు 19 వసంతాలుగా నాటికలను పరిచయం చేస్తు వారిలో ఆలోచన రేకెత్తిస్తున్న సీఆర్సీ సేవలు ప్రశంసనీయం అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం కాలంలో నాటక రంగం కీలక పాత్ర వహించిందన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సీఆర్సీ కార్యవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సినీ నటుడు జెన్నీ, రామచంద్రపురం డీఎస్సీ ఎన్బీ మురళీకృష్ణ, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, సీఆర్సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి ఆశోక్‌రెడ్డి, సేవా విభాగం డైరెక్టర్ కర్రి సుబ్బారెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, సత్తి రామకృష్ణారెడ్డి(మారుతి), మల్లిడి వీర్రెడ్డి, నల్లమిల్లి వీరాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, మంతెన రవిరాజు, పలివెల త్రిమూర్తులు, మన్యం సుబ్రహ్మణ్శేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాటికలు మొదటిరోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గుంటూరు జిల్లా కట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘గోవు మాలచ్చిమి’ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు సైకిల్ అద్దెకు తీసుకుని అద్దె చెల్లించేవాళ్ళమని ఇప్పుడు ఆడదాన్ని గర్భాన్ని అద్దెకు తీసుకుని వ్యాపారంగా మార్చి అమ్మతనాన్ని మంటకలుపుతున్నామని ఈ నాటిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అద్దె గర్భ వ్యాపారానికి సంకెళ్ళు వేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని తెలియజేప్పారు. అనంతరం హైదరాబాద్ శ్రీ మురళీ కళానిలయం వారు ప్రదర్శించిన ‘అం అః కం కః’ నాటిక హాస్యభరితంగా సాగింది. కష్టపడకుండా కోట్లు సంపాదించాలని దురాశతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చివరకు బాకీదారులను తట్టుకోలేక చనిపోయినట్టు నాటకం ఆడిన విశ్వపతికి అప్పుల వాళ్ళు ఎలా బుద్ధి చెప్పారో చూపారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రదర్శనలను తిలకించారు. వారికి సీఆర్సీ సభ్యులు ఆల్పాహారం ఏర్పాటు చేశారు. పోటీలకు అదృష్టదీపక్, పోల్నాటి గోవిందరావు, బొడ్డు రాజబాబు నాయ్యనిర్ణేతలుగా వ్యవహరించారు. -
వచ్చే నెలలో సీఆర్సీ రాష్ట్రస్థాయి ఆహ్వాన కబడ్డీ
రావులపాలెం : సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో రాష్ట్రస్థాయి ఆహ్వాన మె¯ŒS, ఉమె¯ŒS కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి తెలిపారు. రావులపాలెంలోని సీఆర్సీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. రావులపాలెం ప్రభుత్వ ఉభయ కళాశాలల మైదానంలో ఈ పోటీలు జనవరి 13 మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. మెన్, ఉమె¯ŒS విభాగాల్లో విజేతలకు రూ.2.50 లక్షల ప్రైజ్‌మనీ అందిస్తామన్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలు 15వ తేదీ రాత్రి ముగుస్తాయన్నారు. మె¯ŒS విభాగంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు; ఉమె¯ŒS విభాగంలో విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల జట్లు పోటీ పడతాయన్నారు. ఏపీ కబడ్డీ సంఘం కార్యదర్శి వి.వీరలంకయ్య పర్యవేక్షణలో పోటీలు జరుగుతాయన్నారు. సీఆర్సీ స్పోర్ట్స్ డైరెక్టర్ నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, మంతెన రవిరాజు, చిర్ల కనికిరెడ్డి, ఆర్వీఎస్ రామాంజనేయరాజు, కుడుపూడి శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పెన్‌డౌన్
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగ జేఏసీ సోమవారం పెన్‌డౌన్ నిర్వహించింది. అడహక్ ఉద్యోగులకు 2010, 2015 పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో యూనివ ర్సిటీలో పాలన స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీకి పలు పనులపై వచ్చిన విద్యార్థులు అసౌకర్యానికి లోనయ్యారు. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా మరో పక్క యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంగళవారం కూడా పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉద్యోగ జేఏసీ నిర్ణయించింది. అప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. -
ఆ ‘రజత’ ప్రస్థానంలో రావులపాలెం ఓ మజిలీ
సీఆర్సీలో పలు టోర్నమెంట్లలో సత్తా చాటిన పీవీ సింధు 2009లో రాష్ట్రస్థాయి సింగిల్స్, డబుల్స్‌లో గెలిచిన తెలుగు తేజం అనంతరం పలు అంతర్జాతీయ పోటీల్లోనూ విజయాలు రావులపాలెం : రియో ఒలింపిక్స్‌లో దేశానికి రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధు క్రీడా ప్రస్థానంలో కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఓ ముఖ్యమైన మజిలీ అని చెప్పవచ్చు. జాతీయస్థాయి ప్రమాణాలతో ఇక్కడి కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్( సీఆర్సీ)లో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఎన్నోఏళ్ళుగా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. పలు టోర్నమెంట్లలో సింధు 14–15 ఏళ్ళ ప్రాయంలోనే పాల్గొని విజయదుందు«భి మోగించింది. ముఖ్యంగా 2009 ఆగస్టులో రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెలక్షన్స్ కం టోర్నమెంట్లో ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలో దిగిన సింధు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజయం సాధించింది. జాతీయస్థాయ పోటీలకు ఎంపికైంది. అప్పటికే పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన ఆమె తన ఆటతీరుతోప్రత్యర్థులను హడలెత్తించింది. ఆ ఏడాది జాతీయస్థాయిలో జరిగిన వివిధ టోర్నమెంట్లలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందింది. తర్వాత పలు అంతర్జాతీయ పోటీల్లో సైతం ఎన్నో విజయాలు అందుకుంది. సింధు సీఆర్సీలో ఆడటం గర్వకారణం రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సా«ధించి దేశానికి ఖ్యాతి తెచ్చిన సిం««దlుసీఆర్‌సీ ఇండోర్‌స్టేడియంలో పలు టోర్నమెంట్లు ఆడటం మాకెంతో గర్వకారణం.చిన్న వయసు నుంచి చూపిన ప్రతిభే నేడు ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టింది.సింధు వంటి క్రీడాకారిణులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో సీఆర్సీలో నిర్వహించిన పోటీలు ఎంతగానో ఉపకరించాయి. – నందం సత్యనారాయణ, సీఆర్సీ అధ్యక్షుడు సింధుకు మరింత ఉజ్వల భవిష్యత్తు ఎంతో కృషితో రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధంచిన సింధు దేశానికి ఎంతో గర్వకారణం. ఏపీబీఏ ఉపాధ్యక్షుడిగా పలు టోర్నమెంట్లలో సింధు ఆటను దగ్గరగాచూశాను. ఆమెతో కలసి ఇండియా జట్టు మేనేజర్‌గా ఇండోనేషియా సూపర్ సిరీస్‌కు వెళ్లాను. సింధుకు మరింత ఉజ్వల భవిష్యత్ ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. – తేతలి నారాయణరెడ్డి, ఏపీబీఏ ఉపాధ్యక్షుడు -
సీఎంది శల్యసారథ్యం
– సి.రామచంద్రయ్య ఎద్దేవా సాక్షి, తిరుమల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుది శల్య సారథ్యమని, ప్రత్యేక హోదా సాధించుకోవటంలో విఫలమయ్యారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీని దక్కించుకోవటంలో ఏమాత్రం చొరవ చూపలేదన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు నామాల స్వామికి, అటు జనానికి నామాలు పెట్టేశారన్నారు. హోదా సాధనలో టీడీపీ చిత్తశుద్ధి లేకుండా డ్రామాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఏపీ సీఎంతోపాటు తెలంగాణ సీఎం జనం కష్టాలు మరచి సొంత ప్రయోజనాలకే ఎక్కువ చొరవ చూపటం బాధాకరమన్నారు. ఏపీ హోదా సాధన కోసం అందరూ కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలన్నీ విభేదాలు మరచి హోదా సాధన కోసం కృషి చేయాలని శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. -
అవినీతిలో స్టేట్ నంబర్‌వన్
కడప కార్పొరేషన్: అవినీతిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని శాసనమండలి ప్రతిపక్షనేత సీ. రామచంద్రయ్య విమర్శించారు. బుధవారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వవైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్వయంగా చేయించుకొన్న సర్వేలో 87 శాతం మంది ప్రజలు బాగుందని చెప్పినట్లు ప్రకటించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ సర్వేలోనే రెవెన్యూలో అవినీతి పెరిగిందని పేర్కొనడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రికి ఒక రకమైన సర్వే, మంత్రులకు మరో రకమైన సర్వేలు చేయించుకుంటూ ఆత్మవంచన చేసుకొని తృప్తి పడుతున్నారని విమర్శించారు. కేబినెట్లో మంత్రులను తొలగించడానికే ఈ ఎత్తుగడ వేశారన్నారు. ప్రధాని నరేంద్రమోడీ చేయించిన సర్వేలో రాష్ట్రం అవినీతిలో నంబర్ వన్‌గా నిలిచిందని, పనితీరులో సీఎం చంద్రబాబు 13వ స్థానంలో నిలిచారన్నారు. ఇవేవీ ఆయన పైకి చెప్పుకోవడం లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటు, అసెంబ్లీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జేబు సంస్థలుగా వాడుకొంటున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో ఏ బిల్లు అయినా చర్చకు రావాలంటే రాష్ట్రపతి అనుమతి కావాలని, గత ఏడాది ఆగష్టులో ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పార్లమెంటు వ్యవహారాల అధికారులు, రాష్ట్రపతి అందరూ కూడా అది ఆర్థిక బిల్లు కాదనే సిఫారసు చేశారన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి అరుణ్‌జైట్లీ ఇది ఆర్థిక బిల్లు అని చెప్పడం వింతగా ఉందన్నారు. పార్లమెంటుకు సంబంధించిన వీడియోను ఎంపీ వెబ్సైట్లో ఉంచాడని, అతన్ని అరెస్ట్ చేయాలని బీజేపీ కావాలనే రాద్దాంతం చేసిందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరక్కుండా చేసేందుకే ఇలా చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి సీఎం చంద్రబాబు శల్య సార«థ్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఒక్క రాష్ట్రానికైనా చట్టం చేసి ఇచ్చారేమో చెప్పాలని ప్రశ్నించారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లుకావాలని అడిగిన వెంకయ్యనాయుడు చట్టం చేయాలని అనాడే ఎందుకు అడగలేకపోయారని నిలదీశారు. ముఖ్యమంత్రే అవినీతిపరుడైతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. విజయవాడలోని స్వరాజ్‌మైదానాన్ని చైనా కంపెనీకి అప్పగించారని, వారు అది కట్టుకోవడానికి నిధులు తెచ్చుకొంటే అది పెట్టుబడిగా చూపిస్తున్నారని తెలిపారు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో సీఎం చెప్పాలన్నారు. సీఎం వైఖరి వల్ల కేంద్ర బడ్జెట్లో, రైల్వేస్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, వైఎస్ఆర్ జిల్లా ఇప్పటికే బలైపోయిందని, త్వరలో రాష్ట్ర ప్రజలు కూడా బలికాబోతున్నారని జోస్యం చెప్పారు. కడపలో ఉక్కుఫ్యాక్టరీని స్థాపిస్తే లాభదాయకమని ఒక ప్రయివేటు సంస్థ భావించి పెట్టుబడులు పెట్టిందని, బ్యాంకు అధికారులు కూడా అది నిజమని నమ్మి రుణం ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేస్తే లాభదాయం కాదని అధికారులు నివేధిక ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించకపోతే సీఎం చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి నీలిశ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు బండి జకరయ్య, ఎస్ఏ సత్తార్, శాంతయ్య పాల్గొన్నారు. -
బిల్లు ఆమోదించకుంటే పుట్టగతులుండవ్
కడప అగ్రికల్చర్ : రాష్ట్రానికి ప్రత్యేకహోదా బిల్లు ఆమోదించకుండా మనీబిల్లు అని పక్కన పెట్టడం దారుణమని, బిల్లు ఆమోదించకుంటే బీజేపీ, టీడీపీలకు పుట్టగతులు ఉండవని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా బిల్లుపై చర్చ జరిగిందని, అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇది మనీ బిల్లు అని చెప్పడమంటే బాధ్యత నుంచి తప్పుకోవడమేనని అన్నారు. 2015 ఆగస్టులో ప్రత్యేక బిల్లు చర్చకు రాష్ట్రపతి అనుమతి లభించిదన్నారు. మరి ఇన్నిరోజులుగా ఇది మనీ బిల్లా, సాధారణ బిల్లునా అనే విషయం బీజేపీ మంత్రులకు, ప్రధానికి తెలియదా? అని ప్రశ్నించారు. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి మాట్లాడి మద్దతు కూడగట్టామన్నారు. ఏడాది పాటు సాగదీసి ఇప్పుడు బిల్లు చర్చకు రాగానే మనీ బిల్లు అనడం ఎంతవరకు సమంజసమన్నారు. చట్టంలో పొందుపరచినవి తెచ్చుకోలేని బలహీన ముఖ్యమంత్రి చంద్రబాబని దుయ్యబట్టారు. ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి, వెంకయ్యనాయుడుకు ప్రత్యేకహోదా ఇవ్వడం ఇష్టం లేదన్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీ దొంగనాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు శల్యసారథ్యం వహిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు కనుక ఆమోదించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.