సీఎంను కలిసిన కల్లప్ప హండిబాగ్ కుటుంబ సభ్యులు
బెంగళూరు:కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డ డీఎస్పీ కల్లప్ప హండిబాగ్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. తమ కుటుంబానికి సహాయం చేయాల్సిందిగా కల్లప్ప కుటుంబ సభ్యులు సీఎంకు విన్నవించుకున్నారు. సోమవారమిక్కడి అధికారిక నివాసం కావేరిలో కల్లప్ప భార్య విద్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, కల్లప్ప తల్లిదండ్రులు సీఎంను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.
ఇంటి పెద్దను కోల్పోయి అనాతగా మారిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ కల్లప్ప భార్య విద్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చామని, త్వరలోనే ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పిస్తూ ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఇక ఇదే సందర్భంలో కల్లప్ప సోదరునికి ఏదైనా సహకార సంఘంలో ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ హామీ ఇచ్చారు.
మా కుటుంబానికి సహాయం చేయండి
Published Tue, Jul 26 2016 1:48 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement