15 స్థానాల్లో పోటీ
Published Sun, Oct 6 2013 3:34 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
లోక్‌సభ ఎన్నికలు తమకు చావోరేవో కావడంతో గెలుపు లక్ష్యంగా పీఎంకే కుస్తీలు పడుతోంది. తమకు పట్టున్న 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు నిర్ణయించింది. ఇతర పార్టీల కన్నా ముందుగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే దిశగా జాబితా సిద్ధం చేస్తోంది.
సాక్షి, చెన్నై: గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల్లో తరచూ కూటములను మార్చడమే ఈ పరిస్థికి కారణమనే వాదన వినిపించింది. దీంతో ఇకపై ఏ కూటమిలోకీ వెళ్లమని, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని పీఎంకే అధినేత రాందాస్ ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాల్లో తలమునకలయ్యూరు. ఇతర పార్టీల కన్నా ముందుగానే ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టారు. అభ్యర్థుల జాబితానూ సిద్ధం చేస్తున్నారు.
ఇక్కడే పోటీ
ఇది వరకు అసెంబ్లీ, స్థానిక సంస్థల వారీగా వచ్చిన ఓట్లను ఆధారంగా చేసుకుని పదిహేను లోక్‌సభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థుల్ని దించేందుకు రాందాసు నిర్ణయించారు. ఇందులో ఉత్తర చెన్నై, శ్రీ పెరంబదూరు, తిరువళ్లూరు, చిదంబరం, కంచి, విల్లుపురం, ధర్మపురి, కృష్ణగిరి, ఆరణి, తిరువణ్ణామలై, కడలూరు, కళ్లకురిచ్చి, అరక్కోణం తదితర నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ బరిలోకి దిగబోయే అభ్యర్థుల జాబితాను తయూరు చేయడంలో రాందాస్ బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాల్లోని పార్టీ సీనియర్ల సహకారం తీసుకుంటున్నారు. ఆయూ నియోజకవర్గాల్లో ఆర్థికంగా పట్టున్న, జనాదరణ కలిగిన నేతల వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెలాఖరులోపు అభ్యర్థుల పేర్లను ప్రకటించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
విజయమే లక్ష్యం
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లలో గెలుపుతో తమ సత్తా చాటుతామని రాందాసు ధీమా వ్యక్తం చేశారు. చెన్నై నగరంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమానికి రాందాసు హాజరయ్యారు. ఆయన మీడియూతో మాట్లాడుతూ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇక తమ పార్టీ పయనం సాగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా కార్యాచరణ రూపొం దించామని వెల్లడించారు. ముందుగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన రాందాసు ప్రేమ పవిత్రమైందన్నారు. ప్రేమ ముసుగులో సాగుతోన్న మోసం, అన్యాయూన్నే తాను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. గృహ హింసా చట్టంలో సవరణలు చేయాలని కోరారు.
Advertisement