కమల్‌కు దర్శకుడిగా ప్రభుదేవా | Prabhu Deva to direct Kamal Haaan's next? | Sakshi
Sakshi News home page

కమల్‌కు దర్శకుడిగా ప్రభుదేవా

Published Mon, Mar 2 2015 1:41 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కమల్‌కు దర్శకుడిగా ప్రభుదేవా - Sakshi

కమల్‌కు దర్శకుడిగా ప్రభుదేవా

భారతీయ చిత్రాలకు దర్శకత్వం వహించి మేటి దర్శకుడిగా వెలుగొందుతున్న నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా విశ్వనాయకుడు కమలహాసన్‌కు దర్శకత్వం చేయనున్నారు. టాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన నువ్వొస్తావంటే నేనొద్దంటానా చిత్రం ద్వారా దర్శకుడిగా అవతారమెత్తిన ప్రభుదేవా తొలి చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే విధంగా తమిళంలో విజయ్ పోకిరి చూపించి సూపర్‌సక్సెస్ అయ్యారు. ఆ పై బాలీవుడ్ కెళ్లి అక్కడ స్టార్ హీరోలు సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్‌తో చిత్రాలు చేసి స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
 
  ప్రస్తుతం అక్కడ అక్షయ్‌కుమార్ హీరోగా సింగ్ ఈజ్ కింగ్ చిత్రం చేస్తున్న ప్రభుదేవా త్వరలో ప్రఖ్యాత నటుడు కమలహాసన్‌కు దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్ నటించిన ఉత్తమ విలన్, విశ్వరూపం-2, పాపనాశం వంటి మూడు చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. వీటిలో ఉత్తమ విలన్ ముందుగా తెరపైకి రానుంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ  ఆదివారం సాయంత్రం చిత్ర ప్రముఖులు, కమల్ అభిమానుల మధ్య బ్రహ్మాండంగా జరిగింది. కమల్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రాన్ని శివశ్రీ శ్రీనివాసన్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర కథా చర్చలు జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, సాంకేతికవర్గం ఎంపిక జరగాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement