పీఎంసీకి రికార్డు స్థాయిలో రాబడి
Published Sun, Oct 20 2013 11:24 PM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM
పింప్రి, న్యూస్‌లైన్: వివిధ పన్నుల రూపంలో పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి రికార్డుస్థాయిలో రాబడి వచ్చింది. గత నాలుగేళ్ల కాలంలో మొత్తం రూ.196 కోట్ల ఆదాయం వచ్చింది. 2009-10లో రూ.11.15 లక్షలు, 2010-11లో రూ.62.83, అదేవిధంగా 2011-12 మధ్యకాలంలో రూ.72 లక్షలు, 2012-13లో ఇప్పటిదాకా రూ.45.38 లక్షలు వసూల య్యాయి. ఇదిలా వుండగా పుణే నగర విస్తీర్ణం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీని పరిధిలో ఉద్యో గ, వాణిజ్య నగర ప్రజల ఆవాసాలుకూడా బాగా పెరిగాయి. దీంతో 2009 నుంచి కార్పొరేషన్ క్యాపిటేషన్ ఫీజును వసూలు చేస్తోంది. ఇందులో ఫైర్ సెస్, భవన నిర్మాణ, వాణిజ్య, ఉద్యోగ రంగాల వారికి నిరభ్యంతర పత్రాలు, ఫైర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చార్జీలు, అగ్నిమాపక సేవాపన్ను తదితరాలను వసూలు చేస్తోంది. ఈ పన్నులన్నింటినీ కార్పొరేషన్ స్థాయీసమితి పన్నుల విభాగం నిర్ణయిస్తుంది.
పల్లకీ మార్గాల్లో స్థలసేకరణ
సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం పల్లకీలు వెళ్లే మార్గాల్లో భక్తులకు వసతి కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం నడుంబిగించింది. ఇందులోభాగంగా ఆయా మార్గాల్లో స్థలసేకరణ దిశగా అడుగు లు వేస్తోంది. ఈ ప్రతిపాదన గత కొద్దిసంవత్సరాలుగా చర్చలకే పరిమితమైన సంగతి విదితమే. స్థలసేకరణకు సంబంధించి డివిజినల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇటీవల ఓ సమావేశం కూడా జరిగిం ది. స్థలసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆ సమావేశంలో సంబంధిత అధికారులు నిర్ణయించారు. పల్లకీలను రాత్రిపూట ఆపే ప్రాంతాల్లో వర్కారీ భక్తులు స్నానాదులు ముగించుకుని నిద్రకు ఉపక్రమించేందుకు అనువుగా బసలను నిర్మించనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. స్థలసేకరణ తర్వాత అక్కడ అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరగకుండా అడ్డుకునేందుకు వాటిచుట్టూ కంచెలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాలోని దేహులో బహిరంగ మరుగుదొడ్లను కూడా నిర్మించాలని నిర్ణయించింది.
నిధుల కేటాయింపు
దేహు, అలండి, పండరీపూర్‌లలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 750 కోట్ల నిధులను కేటాయించింది. అదేవిధంగా దేహులో మరుగుదొడ్ల నిర్మాణానికికూడా అనుమతి ఇచ్చింది. దేహుతోపాటు అలండి, పండరీపూర్‌లలోనూ త్వరలో వీటిని నిర్మించనున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో రహదారులను సైతం అభివృద్ధి చేయనున్నారు.
Advertisement
Advertisement