వడ్సా: ముంబై - ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్‌తో మహారాష్ట్రకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పృథ్వీరాజ్ చవాన్ ఆధ్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలోనే ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించిన రాష్ట్రం మహారాష్ర్ట అని అన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలోని వడ్సా పట్టణంలో శుక్రవారం జరిగిన బహిరంగసభలో రాహుల్ మాట్లాడా రు. మహిళాభివృద్ధికి యూపీఏ సర్కారు ఎంతో చేసిందన్నారు. మళ్లీ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో 2,000 మహిళా పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేస్తామని, పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని యూపీఏ ప్రయత్నించినా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆయన విమర్శించారు. ఈ సారి తప్పకుండా ఆ బిల్లు పాస్ అయ్యేలా కృషిచేస్తామన్నారు. వచ్చే ప్రభుత్వం దేశంలో 70 శాతానికి పైగా ఉన్న కార్మికులు, కర్షకులు, పేదలు, గిరిజనులకు ప్రాతినిధ్యం వహించేది కావాలన్నారు. స్థానిక విషయాలను ప్రస్తావిస్తూ జిల్లాలో చవాన్ సర్కార్ వెదురు ప్రాసెసింగ్ ప్రాజెక్టును ఏర్పాటుచేసిందన్నారు. అలాగే అటవీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కుల పరిరక్షణకు అటవీ హక్కుల చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకువచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి మోహన్‌ప్రకాశ్, ఎంపీసీసీ చీఫ్ మానిక్‌రావ్ ఠాక్రే, గడ్చిరోలీ లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ నామ్డియో ఉసెండీ, మాజీ మంత్రి వజయ్ వట్టివార్ తదితరులు పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ కారిడార్‌తో రాష్ట్రానికి మేలు
Published Fri, Mar 28 2014 10:48 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement