నటి సుకన్యరాజాకి రజనీకాంత్‌ పార్టీ కార్యదర్శి పగ్గాలు | Rajinikanth Party secretary post Sukanya Raja | Sakshi
Sakshi News home page

నటి సుకన్యరాజాకి రజనీకాంత్‌ పార్టీ కార్యదర్శి పగ్గాలు

Published Thu, Sep 20 2018 12:42 PM | Last Updated on Thu, Sep 20 2018 12:42 PM

Rajinikanth Party secretary post Sukanya Raja - Sakshi

తమిళసినిమా: సింగపూర్‌లో పార్టీ కార్యదర్శి పగ్గాలను రజనీకాంత్‌ నటి సుకన్య రాజాకు అప్పగించారు. నటుడు రజనీకాంత్‌ గత ఏడాది డిసెంబర్‌లో రాజకీయరంగప్రవేశంపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన అభిమాన సంఘాలను ప్రజాసంఘాలుగా మార్చి రాష్ట్రవ్యాప్తంగా కార్య నిర్వాహకులను నియమిస్తున్నారు. పుదుచ్చేరిలోనూ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు.

 రజనీకాంత్‌కు జపాన్, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆయా దేశాల్లోనూ తన పార్టీకి నిర్వాహకులను నియమిస్తున్నారు. అందులో భాగంగా సింగపూర్‌లో పార్టీ కార్యదర్శి బాధ్యతలను నటి సుకన్య రాజాకు అప్పగించారు. ఈమె చిన్నతనం నుంచి రజనీకాంత్‌కు వీరాభిమాని. సుకన్యరాజాకు రజనీకాంత్‌ కాలా చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు. అందులో తను రజనీకాంత్‌ కోడలిగా నటించింది. ఆ విధంగా రజనీకాంత్‌కు పరిచయమైన సుకన్యరాజా పూర్వీకులది  దిండుగల్‌. తండ్రి ఉద్యోగం రీత్యా సుకన్యరాజా కుటుంబం సింగపూర్‌లో సెటిల్‌ అయ్యారు.

 దీంతో ఆమెకు రజనీకాంత్‌ సింగపూర్‌లో పార్టీ కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. సుకన్యరాజా మాట్లాడుతూ రజనీకాంత్‌కు విదేశాల్లోనూ అభిమానులు ఉన్న విషయం తెలిసిందేనన్నారు. ముఖ్యంగా సింగపూర్‌లో తమిళనాడులో అభిమానులకు సమానంగా ఉన్నారని చెప్పింది. అయితే వారంతా విడివిడిగా సంఘాలు నిర్వహిస్తున్నారని, అలాంటి వారందరినీ ఒక్క తాటిపై తీసుకురావడమే తన కర్తవ్యం అని అంది. రజనీకాంత్‌ తనను నమ్మి చాలా పెద్ద  బాధ్యతను అప్పగించారని, దాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తానని సుకన్య రాజా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement