ఈగ సీక్వెల్లోనూ సమంత? | Samantha in Eega Sequel | Sakshi
Sakshi News home page

ఈగ సీక్వెల్లోనూ సమంత?

Published Mon, Sep 7 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

ఈగ సీక్వెల్లోనూ సమంత?

ఈగ సీక్వెల్లోనూ సమంత?

తెలుగులో ఈగ గానూ, తమిళంలో నాన్‌ఈ గానూ విశేష ప్రజాధరణ పొందిన ద్విభాషా చిత్ర కొనసాగింపునకు రంగం సిద్ధం అవ్వనుందా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. కథ,కథనం,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్మి చిత్రాలను వెండితెరపై అందంగా,అబ్బురపరచే విధంగా ఆవిష్కరించే దర్శక తాంత్రికుడు రాజమౌళి.ఈయన చిత్రాలు తదుపరి తరానికి ఒక లెసన్ అవుతాయన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదేమో.చిన్న తారలతో అయినా,పెద్ద నక్షత్రాలతో అయిన తనదైన దర్శకత్వ నైపుణ్యంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగల దిట్ట రాజమౌళి. ఈగ చిత్రంతో దక్షిణాది సినీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించిన ఈ దర్శక సవ్యసాచి రీసెంట్‌గా బాహుబలి చిత్రంతో భళా అనిపించుకున్నారు.
 
 ప్రస్తుతం బాహుబలి-2ను చెక్క పనిలో నిమగ్మమైన జక్కన్న తదుపరి ఈగ వేటను కొనసాగించనున్నారట. ఈగ చిత్రం హీరో నాని ఈ విషయాన్ని వెల్లడించినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. నాని నటించిన భలేభలే మగాడివోయ్ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నాని నటనను ప్రశంసించిన దర్శకుడు రాజమౌళి ఈగ చిత్ర కొనసాగింపు ఈ ఆలోచన గురించి చెప్పినట్లు నాని వెల్లడించినట్లు తెలిసింది. ఈ సీక్వెల్‌లోనూ అందాల భామ సమంత  నటించే అవకాశం ఉన్నట్టు కోలీవుడ్ సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement