కిటకిట
Published Sun, Jan 12 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ప్రజలు పట్టణాలు, నగరాల నుంచి పల్లెకు తరలిపోతారు. గత ఏడాది కంటే, ఈ సారి పంటల ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. ఇది అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడి ఉన్న తమ వాళ్లతో కలసి ఆత్మీయులందరూ కలసి పెద్ద పండుగను జరుపుకునేందుకు శనివారం ప్రయూణం కట్టారు. దీంతో చెన్నైలోని కోయంబేడు బస్టాండ్, సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయూయి. సాధారణ రైళ్లతో పాటుగా ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టాయి. దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లే అన్ని రైళ్లు కిక్కిరిశాయి. అన్ రిజర్వుడ్ ప్రయాణికులకు సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అయితే, పోలీసులు అప్రమత్తం కావడంతో తరలివచ్చిన ప్రయూణికులందరినీ క్యూలోనే బోగీల్లోకి ఎక్కించారు.
పతి ప్రయాణికుడ్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతించారు. అన్ రిజర్వుడ్ బోగీల్లోని బెర్త్‌లతో పాటుగా లగేజీ బెర్త్‌లు, లకేజీ బోగిల్లో సైతం ప్రయాణికులు ఎక్కేశారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు గొడవలకు దిగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడ ంతో పాటుగా క్యూ ఆధారంగా తోపులాటకు ఆస్కారం ఇవ్వని రీతిలో ఒక్కొక్కరిని అనుమతించడం అభినందనీయం. ఇక, చెన్నై కోయంబేడు ప్రధాన బస్ టెర్మినల్, ఆమ్నీ టెర్నినల్స్‌లోను ప్రయాణికులు కిక్కిరిసిపోయూరు. కోయంబేడు నుంచి శుక్రవారం రాత్రి 600 ప్రత్యేక బస్సులు నడపగా, శనివారం 1,345 బస్సులు పరుగులు పెట్టాయి. ప్రత్యేక బస్సుల కోసం ప్రత్యేకంగా బస్టాండ్‌లో స్థలం కేటాయించడంతో ప్రయాణికులకు సులభతరంగా మారింది.
మార్కెట్లలోకి: పండుగకు మరో రోజు మాత్రం సమయం ఉండటంతో శనివారం నగరంలోని ఏ మార్కెట్ చూసినా జనంతో నిండిపోరుుంది. టీ నగర్, పురసై వాక్కం, ప్యారిస్ తదితర వాణిజ్య కేంద్రాల్లో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర శివారుల నుంచి తరలివచ్చిన జనంతో ఆ రోడ్లు, అక్కడి షాపింగ్ మాల్స్ నిండాయి. జేబు దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించకుండా నిఘా నేత్రాల ద్వారా భద్రతను కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించారు. పూజా సామగ్రి పెద్ద ఎత్తున కోయంబేడు మార్కెట్‌కు చేరుకుంటోంది. నల్ల చెరకు, అరటి గెలలు, పువ్వులు, కుండలు, తప్పెట్లు తదితర వస్తువులు మార్కెట్లో కొలువు దీరుతున్నాయి.
ఆమ్నీపై కొరడా: ఆమ్నీ బస్సులపై కొరడా ఝుళిపించే పనిలో రవాణా అధికారులు పడ్డారు. సంక్రాంతిని పురస్కరించుకుని బ్లాక్ మార్కెట్లో చాప కింద నీరులా టికెట్ల విక్రయాలపై ఆమ్నీ యాజమాన్యాలు దృష్టి పెట్టినట్టు వెలుగు చూసింది. అధిక చార్జీలు వసూలు చేయకూడదన్న ఆంక్షల్ని ప్రభుత్వం విధించిన దృష్ట్యా, తమ ట్రావెల్స్ బస్సుల్లో హౌస్‌ఫుల్ అంటూ, మరో ట్రావెల్స్ బస్సులకు బ్లాక్ టికెట్లు ఇప్పించే పనుల్లో సిబ్బంది పడ్డారు. కొత్తరకంలో దోపిడీకి ట్రావెల్స్ దిగడంతో ఫిర్యాదులు చేరుతున్నాయి. దీంతో కొరడా ఝుళిపించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బెంగళూరుకు చెందిన ట్రావెల్స్ బస్సు యాజమాన్యం అదిగో బస్సు...ఇదిగో బస్సు అంటూ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ప్రయాణికుల్ని పడిగాపులు కాయించడం వివాదానికి దారి తీసింది. ఆ ట్రావె ల్స్‌పై చర్యకు పోలీసులు సిద్ధమయ్యారు. ఐదున్నర గంటలకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి బెంగళూరుకు ప్రయాణికులను తరలించారు.
Advertisement
Advertisement