ధనుష్‌తో షణ్ముగపాండియన్ ఢీ | shanmugapandiyan ana dhanush movies releases on same time | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో షణ్ముగపాండియన్ ఢీ

Published Wed, Jan 21 2015 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

ధనుష్‌తో షణ్ముగపాండియన్ ఢీ

ధనుష్‌తో షణ్ముగపాండియన్ ఢీ

ధనుష్‌తో ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు నవ నటుడు షణ్ముగపాండియన్. సీనియర్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ వారసుడైన ఈ నూతన నటుడు సగాబ్దం చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. కెప్టెన్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎల్‌కె సుదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సురేంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ నేహా హింగే హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి కార్తీక్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈయన సంగీతం అందిస్తున్న చిత్రం ఇది.
 
 చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సగాబ్దం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 31న నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రేమికులరోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారిక పూర్వకంగా చిత్ర నిర్మాత ప్రకటించారు. ఫిబ్రవరి 13న ధనుష్ నటించిన అనేగన్ చిత్రం తెరపైకి రానుంది. దీంతో నవ నటుడు షణ్ముగపాండియన్, ధనుష్‌తో ఢీ కొననున్నారన్నమాట.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement