dmdk leader Vijayakanth
-
విచారణలపై స్టే
కెప్టెన్ దంపతులకు హైకోర్టులో ఊరట 14 కేసుల్లో ఉపశమనం మరో పీటీ వారెంట్ పెరంబలూరు కోర్టు జారీ సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు ఊరట నిస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇద్దరి మీదున్న పద్నాలుగు పరువు నష్టం దావా కేసుల విచారణలకు న్యాయమూర్తి ప్రకాష్ మధ్యంతర స్టే విధించారు. ఓ వైపు కేసుల విచారణకు మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చి ఉంటే, మరో వైపు విచారణకు హాజరు కాలేదని పెరంబలూరు కోర్టు విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో సీఎం జయలలిత, మంత్రులకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పిస్తే, పరువు నష్టం దావాల మోత మోగుతున్న విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పక్షాల నాయకుల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ మీద ఈ కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. జిల్లాకు ఒకటి చొప్పున దావాలను ఆయన ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఈ కేసుల విచారణకు డుమ్మా కొడుతున్న ఆయన మీద జిల్లా కోర్టుల న్యాయమూర్తులు కన్నెర్ర చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే విజయకాంత్‌కు పలు పీటీ వారెంట్లు జారీ అయ్యా యి. ఇక, ఆయన సతీమణి ప్రేమలత మీద కూ డా ఈ కేసుల మోత మోగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇటీవల తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడం, విల్లుపురం కోర్టు అక్షింతలు వేయడం వెరసి ఈ కేసుల వ్యవహారాల్ని ఎదుర్కొనేందుకు సుప్రీం కోర్టును విజయకాంత్ ఆశ్రయించారు. ఈ దావాలపై సుప్రీంకోర్టు సై తం అసహనం వ్యక్తం చేసి ఉన్నదని చెప్పవచ్చు. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించి, ఈ కేసుల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో విజయకాంత్, ఆ యన సతీమణి ప్రేమలత నిమగ్నమయ్యారు. ఇందుకు తగ్గ పిటిషన్ మద్రాసు హైకోర్టుకు గత నెలాఖరులో చేరింది. బుధవారం పిటిషన్ విచారణకు రావడంతో విజయకాంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను న్యాయమూర్తి ప్రకాష్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఉంచారు. వాదనల అనంతరం విజయకాంత్, ప్రేమలత విజయకాంత్‌కు ఊరట నిస్తూ ఆ దేశాలు జారీ అయ్యాయి. సీఎం జయలలిత, మం త్రుల తరఫున ఆ ఇద్దరిపై దాఖలై ఉన్న పద్నాలు గు కేసుల విచారణలకు మధ్యంతర స్టే విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ వైపు పద్నాలుగు కేసుల విచారణకు మధ్యంతర స్టే జారీ అయితే, మరోవైపు పెరంబలూరు కోర్టు విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేయడం గమనార్హం. పీటీ వారెంట్: పెరంబలూరు కోర్టులు విజయకాంత్‌పై పరువు నష్టం దావా కేసుకు తగ్గ పిటిషన్ విచారణ సాగుతూ వస్తోంది. బుధవారం విజయకాంత్ కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది. అయితే, ఆయన డుమ్మా కొట్టారు. విజయకాంత్ తరఫు న్యాయవాదులు కోర్టుకు రాని దృష్ట్యా, న్యాయమూర్తి నషీమా భాను కన్నెర్ర చేశారు. విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేస్తూ, కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. -
ఇక రాత్రుల్లోనే ప్రచారం కెప్టెన్ కొత్తబాట
సాక్షి, చెన్నై: ఎండ దెబ్బకు తానేమి చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి, డీఎండీకే అధినేత విజయకాంత్ ఉన్నట్టుంది. ఇక, సాయంత్రం, రాత్రుల్లోనే ప్రచారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించే పనిలో పడ్డారు. విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏదీ ముందుగా తలచుకోరు, సమయానికి తగ్గట్టుగా మాత్రమే వ్యవహరిస్తారు. ప్రసంగాల్లో కూడా తనకు తోచిందే మాట్లాడుతుంటారు. అలాంటి విజయకాంత్‌కు తరచూ కోపం రావడం సహజం. బుధవారం మీడియాను టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించిన విజయకాంత్, ఇక జాగ్రత్తల్లో పడ్డారు. ఇదంతా ఎండ దెబ్బే అని చాటుకునే విధంగా, దానికి ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ప్రచారానికి దూరం అని ప్రకటించేసుకున్నారట!. అబ్బో విజయకాంత్ ఏమైనా తెలివైన వాడే. ఎండ దెబ్బకు తానే కాదు, తన కార్యకర్త కూడా సొమ్మసిల్లి పోకూడదనే, ఇక సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రచార, బహిరంగ సభలకు చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలకు సూచించే పనిలో పడ్డారు. ఎండ వేడి మరీ ఎక్కువగా ఉందని, ఇతరుల సభల్లో కార్యకర్తలు భానుడి దెబ్బకు మృత్యువాత పడుతున్నారని పరోక్షంగా అమ్మ జయలలిత సభల్లో చోటుచేసుకున్న ఘటనల్ని ఎత్తి చూపుతూ కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు గురువారం సందేశాన్ని పంపించారు. -
అమ్మ బొమ్మ కేసులో కెప్టెన్ కు బెయిల్
-అమ్మ బొమ్మ కేసులో కోర్టుకు సాక్షి, చెన్నై:బస్టాప్‌లో ఉన్న అమ్మ బొమ్మను తొలగిస్తూ ఆదేశించిన కేసులో డీఎండీకే అధినేత విజయకాంత్‌కు బెయిల్ లభించింది. ఈ కేసు విచారణ నిమిత్తం తంజావూరు కోర్టు మెట్లు గురువారం విజయకాంత్ ఎక్కాల్సివచ్చింది. వర్షాలు, వరదలతో డెల్టా అన్నదాత తీవ్ర కష్టాల్లో మునిగి ఉన్న విషయం తెలిసిందే. వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కంటి తుడుపు చర్యగా ఉండటంతో పోరు బాటకు డిసెంబర్లో విజయకాంత్ పిలుపు నిచ్చారు. డిఎండికే నేతృత్వంలో రైతు మద్దతు దీక్షకు తంజావూరులో జరిగింది. విజయకాంత్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి బస్టాప్‌లో సీఎం జయలలిత బొమ్మ ఉండటంతో ఆగ్రహంతో ఊగి పోయారు. ఆ బొమ్మను తొలగించే విధంగా పార్టీ వర్గాలకు ఆదేశించారు. అత్యుత్సాహంతో డిఎండికే వర్గాలు ఆ బొమ్మను చించి పడేయడంతో తంజావూరులో రణ రంగానికి దారి తీసింది. ఈ వ్యవహారంతో అన్నాడిఎంకే వర్గాలు తమ ప్రతాపాన్ని డిఎండికే మీదచూపించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో వ్యవహారం కేసులకు దారి తీసింది. సీఎం జయలలిత బొమ్మను ధ్వంసం చేయాలని ఆదేశించడం, నోటి దురుసుతో తంజావూరులో వివాదం సృష్టించడం తదితర సెక్షన్ల మోత డిఎండికే వర్గాల మీద మోగాయి. ఈకేసులో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అరెస్టు అయ్యారు. ఎన్నికల సమయంలో విజయకాంత్‌ను సైతం అరెస్టుచేయోచ్చన్న సంకేతాలు బయలు దేరాయి. దీంతో ముందస్తు బెయిల్ కోసం మదురై ధర్మాసంను ఆయన ఆశ్రయించారు. అయితే, తంజావూరు కోర్టు విచారణకు హాజరై, అక్కడే బెయిల్ తీసుకోవాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం సూచించింది. కెప్టెన్‌కు బెయిల్: మదురై ధర్మాసనం సూచనతో గురువారం విజయకాంత్ తంజావూరుకు చేరుకున్నారు. కోర్టుకు తమ నేత హాజరు అవుతుండడంతో పెద్ద ఎత్తున డీఎండీకే వర్గాలు అక్కడికి తరలివచ్చాయి. విజయకాంత్‌ను కోర్టుకు వెళ్లే మార్గంలో పోలీసులు అరెస్టు చేయొచ్చన్న ప్రచారం బయలు దేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, పోలీసులు అలాంటి సాహసం చేయలేదు. కోర్టు విచారణకు హాజరైన విజయకాంత్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదన విన్పించారు. అయితే, వారి వాదనతో ఏకీభవించని తంజావూరు కోర్టు విజయకాంత్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు నుంచి ఉత్సాహంగా విజయకాంత్ చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. విజయకాంత్ కోర్టు విచారణకు వెళ్లడంతో చెన్నైలో ఆశావహుల ఇంటర్వ్యూల బాధ్యతల్ని పార్టీ నాయకులు ఇలంగోవన్, పార్థసారధి, చంద్రకుమార్ తమ భుజాన వేసుకున్నారు. -
మౌనం దేనికి అంగీకారమో?
* కులదైవానికి కెప్టెన్ పూజలు * మీడియా ఎదుట మౌనం సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ రానున్న ఎన్నికల్లో ఏదో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అది ఏమిటో అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. మంగళవారం తన కుల దైవం వీర చిన్నమ్మాల్ సన్నిధిలో సతీమని ప్రేమలతతో కలిసి విజయకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. పొత్తు పై మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించినా, మౌన ముద్రతో ముందుకు సాగారు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదేని కీలక ప్రకటనలు చేయాలన్న ముందుగా తన కుల దైవం ఆలయాన్ని సందర్శించడం జరుగుతూ వస్తున్నది. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తన చుట్టూ రాజకీయం తిరుగుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న మల్లగుల్లాల్లో విజయకాంత్ పడి ఉన్నారు. ఓవైపు బీజేపీ, మరో వైపు డిఎంకే, ఇంకో వైపు ప్రజా కూటములు ఆహ్వానం పలికి ఉండటంతో ఏదో ఒక కూటమిని ఎంపిక చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. డిఎంకే కూటమి వైపుగా వస్తారన్న ప్రచారం ఉన్నా, ఆయన సతీమణి ప్రేమలత వ్యాఖ్యలు గందరగోళంలోకి నెట్టి ఉన్నాయి. బీజేపీ వైపుగా నడుస్తారా..? లేదా, ప్రజా కూటమిలో సీఎం అభ్యర్థిగా నేతృత్వ పగ్గాలు చేపడుతారా..? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. ఈ సమయంలో తన నిర్ణయం ఏమిటో ప్రకటించేం దుకు తగ్గ మహానాడుకు వేదికగా కాంచీపురంను ఎంపిక చేసుకున్న విజయకాంత్, అందుకు తగ్గ పనుల్లో బిజీగా నే ఉన్నారు. ఈనెల 20వ తేదీన జరగనున్న ఈ మహానా డుద్వారా కీలక ప్రకటన చేయడానికి ఆయన సిద్ధం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే విధంగా మంగళవారం తన కుల దైవాన్ని దర్శించుకుని, మహానాడు ఆహ్వాన పత్రికకు పూజలు చేయడం గమనార్హం. కుల దైవానికి పూజలు : తన సతీమణి ప్రేమలతతో కలసి మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కాంగేయంకు ఉదయం విజయకాంత్ చేరుకున్నారు. అక్కడ కొలువు దీరి ఉన్న తన కుల దైవం వీర చిన్నమ్మాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఆలయంలోకి వెళ్లే సమయంలో మరొకరి సాయంతో ముందుకు సాగిన విజయకాంత్ పూజల అనంతరం మౌనంగా బయటకు వచ్చారు. మీడియా చుట్టుముట్టినా, ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ముందుకు సాగారు. అయితే, ప్రేమలత మాత్రం తమ కులదైవాన్ని సందర్శించే విషయం తెలిసిందే గా అని సమాధానం ఇచ్చి కదిలారు. తదుపరి శ్రీవిళ్లి పుత్తూరు అండాల్ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన విజయకాంత్, తదుపరి తిరుమల శ్రీవారి దర్శించుకునే ఏర్పాట్ల మీద పడ్డారు. ఈ ఆలయబాట తదుపరి ఆయన కీలక నిర్ణయం ప్రకటించడం ఖాయం. అయితే, ఆ నిర్ణయం ఏమిటో అన్న ఉత్కంఠ బీజేపీ, డీఎంకే, ప్రజా కూటమికి మరికొద్ది రోజులు తప్పదు. -
ధనుష్‌తో షణ్ముగపాండియన్ ఢీ
ధనుష్‌తో ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు నవ నటుడు షణ్ముగపాండియన్. సీనియర్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ వారసుడైన ఈ నూతన నటుడు సగాబ్దం చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. కెప్టెన్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎల్‌కె సుదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సురేంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ నేహా హింగే హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి కార్తీక్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈయన సంగీతం అందిస్తున్న చిత్రం ఇది. చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న సగాబ్దం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 31న నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రేమికులరోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు అధికారిక పూర్వకంగా చిత్ర నిర్మాత ప్రకటించారు. ఫిబ్రవరి 13న ధనుష్ నటించిన అనేగన్ చిత్రం తెరపైకి రానుంది. దీంతో నవ నటుడు షణ్ముగపాండియన్, ధనుష్‌తో ఢీ కొననున్నారన్నమాట.