మూడు భాషల్లో షావుకార్‌పేట్టై | sowkarpettai movie in Three languages | Sakshi
Sakshi News home page

మూడు భాషల్లో షావుకార్‌పేట్టై

Published Fri, Aug 14 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

మూడు భాషల్లో షావుకార్‌పేట్టై

మూడు భాషల్లో షావుకార్‌పేట్టై

 కోలీవుడ్‌లో హర్రర్ చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. యువ హీరోల నుంచి ప్రముఖ హీరోల వరకు ఈ తరహా చిత్రాల బాటపడుతుండడం విశేషం అనే చెప్పాలి. తాజాగా నటుడు శ్రీకాంత్, రాయ్‌లక్ష్మి షావుకార్‌పేట్టై అంటూ భయపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ప్రత్యేక అంశం ఏమిటంటే హీరో హీరోయిన్లు ఇద్దరు దెయ్యాలుగా ఒకరిని మించి ఒకరు భీభత్సంగా భయపెట్టిపోతుండడం అందుకే ఇది సమ్‌థింగ్ డిఫరెంట్ హర్రర్ చిత్రం అంటున్నారు. చిత్ర నిర్మాత జాన్ మ్యాక్స్.
 
 సాలోమ్ స్టూడియోస్ పతాకంపై ఇంతకుముందు మైనా, సాట్టై మొసకుట్టి లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన ఈయన తాజాగా నిర్మిస్తున్న చిత్రం షావుకారుపేట్టై. సుమన్, గంజాకరుప్పు, వడివుక్కరసి, శరవణన్, మనోబాలా, వివేక్, అప్పుకుట్టి, కోట శ్రీనివాసరావు తదితర ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడివుడైయాన్ నిర్వహిస్తున్నారు. జాన్‌పీటర్ సంగీతాన్ని చాయాగ్రహణాన్ని శ్రీనివాసరెడ్డి అందిస్తున్న షావుకారుపేట చిత్రం వివరాలను నిర్మాత తెలుపుతూ ఇది షావుకారుపేట్టై చుట్టూ తిరిగే కథ కావడంతో దాన్నే చిత్ర టైటిల్‌గా నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో విభిన్న శ్రీకాంత్, రాయ్‌లక్ష్మీలను చూస్తారన్నారు. చిత్ర షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత జాన్‌మ్యాక్స్ వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement