టీచర్ను లాగి కొట్టిన విద్యార్థి!! | Student slaps teacher in chennai school | Sakshi
Sakshi News home page

టీచర్ను లాగి కొట్టిన విద్యార్థి!!

Published Tue, Dec 2 2014 4:37 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

టీచర్ను లాగి కొట్టిన విద్యార్థి!! - Sakshi

టీచర్ను లాగి కొట్టిన విద్యార్థి!!

అల్లరి పనులు చేసినందుకు మందలించారని.. టీచర్నే లాగి కొట్టాడో విద్యార్థి. ఈ ఉదంతం తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. సదరు విద్యార్థి కంప్యూటర్ క్లాసు జరుగుతుండగా, మెయిన్ స్విచ్ ఆపేశాడు. దాంతో కంప్యూటర్లన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దాంతో.. ప్రవర్తన మార్చుకోవాలని, ఇలా చేయడం సరికాదని ఆమె చెప్పారని, అందుకే ఆ పిల్లాడికి కోపం వచ్చి, టీచర్ను లెంపమీద కొట్టాడని విద్యాశాఖాధికారులు చెప్పారు. ఇంతకుముందు కూడా ఈ పిల్లాడు ఇలాగే ప్రవర్తించిన దాఖలాలున్నాయి. అప్పట్లో క్షమాపణ చెప్పిన తర్వాత స్కూలుకు అనుమతించారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరిపిన తర్వాత విద్యార్థిపై తగిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అయితే.. విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా పోలీసులకు మాత్రం దీనిపై ఫిర్యాదు చేయలేదు. టీచర్ ఎడమ చెవికి దగ్గరగా దెబ్బ తగలడంతో.. లోపలి భాగాలు ఏమైనా దెబ్బతిన్నాయేమోనని పరీక్షించేందుకు ఆమెను ప్రభుత్వాస్పత్రికి పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement