సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో నెలకొన్న పరిణామాల్ని తమకు అనుకూలంగా మలచుకునేందు కు ప్రధాన ప్రతి పక్షం ప్రయత్నాల్లో పడ్డట్టుంది. ఢిల్లీ పర్యటనను సైతం రద్దు చేసుకుని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గోపాలపురంలో అధినేత కరుణానిధితో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీ తదుపరి అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులతో స్టాలిన్ మంతనాల్లో మునిగారు. అధికార పగ్గాలు లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే తీవ్రంగానే ప్రయత్నాలు చేసింది.
అమ్మ జయలలిత హ వా ముందు చివరకు తల వంచక తప్పలేదు. అయినా, అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించే ప్రధాన ప్రతి పక్షంగా డీఎంకే అవతరించింది. 89 మంది సభ్యులతో అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్షంగా బాధ్యతతో వ్యవహరించడమే కాదు. అధికార పక్షంతో కలిసి పలు విషయాల్లో డీఎంకే అడుగులు వేయడం తమిళ రాజకీయల్లో కొత్త వాతావర ణానికి పునాదులు పడ్డట్టు అయింది. ఈ సమయంలో తమిళుల అ మ్మ జయలలిత అనంత లోకాలకు వెళ్లడంతో ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాల మీద డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ స్పందిస్తూనే
వస్తున్నారు. ప్రధానంగా పన్నీరు సెల్వం పనితీరును అభినందించడమే కాదు, వర్దా ప్రళయం, జల్లికట్టు వివాదం, సిరువాని, పాలారు రచ్చల్లో ప్రభుత్వానికి అండగా నిలబడే విధంగానే స్పందించారు. ఈ సమయంలో ప్రస్తుతం పన్నీరు సెల్వంకు ఎదురైన పరిస్థితులపై తొలుత స్పందించింది కూడా స్టాలిన్. ఇప్పుడు అదే స్టాలిన్ తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల్ని ఢిల్లీకి తీసుకెళ్లే రీతిలో తన పర్యటనను సిద్ధం చేసుకున్నా, చివరి క్షణంలో బుధవారం ఉ దయం వాయిదా వేసుకోవడం గమనార్హం. ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం చెన్నైకు వచ్చే అవకాశాలతో ఆయన పర్యటన రద్దుచేసుకున్నట్టు సంకేతాలు ఉ న్నా, అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలతో తదుపరి అడుగుల దిశగా తీవ్రం గానే పార్టీ ముఖ్యులతో స్టాలిన్ మంతనా ల్లో మునగడం చర్చనీయాంశంగా మారిం ది.
ఉదయాన్నే గోపాలపురానికి చేరుకున్న స్టాలిన్ అధినేత కరుణానిధితో భేటీ కావ డం ఆలోచించాల్సిందే. వయోభారం, అ నారోగ్య సమస్యలతో గోపాలపురం ఇం టికే పరిమితమైన రాజకీయ మేథావి కరుణానిధి తన రాజకీయ వ్యూహాలను స్టాలిన్‌తో పంచుకుని ఉండే అవకాశాలు ఎక్కువే. కరుణతో భేటీ అనంతరం పార్టీ నేతలు టీఆర్ బాలు, రాజ, ఏవీ వేలు, పొన్ముడి తదితరులతో గంట పాటు స్టాలిన్ సమాలోచించడం ఆలోచించ తగ్గ విషయమే. అన్నాడీఎంకేలో చీలిక దిశగా సాగే పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు తగ్గ కసరత్తుల్ని తన రాజకీయ తంత్రంతో స్టాలిన్ పార్టీ వర్గాలకు ఉపదేశించి ఉండొచ్చన్న సంకేతాలు ఉన్నాయి.
స్టాలిన్ తంత్రం
Published Thu, Feb 9 2017 2:12 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
Advertisement
Advertisement