హొస్పేట, న్యూస్‌లైన్ :
ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక టౌన్ సీఐ శ్రీధర్‌దొడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పటేల్‌నగర్ ప్రభుత్వ శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ప్రమాదాల నియంత్రణ’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పరిచ యం లేని వ్యక్తులు విద్యార్థులకు తినడానికి చాక్లెట్లు, బిస్కెట్లు తదితర తినుబండారాలు ఇస్తే తీసుకోరాదని సూచించా రు. మహిళలు తమ పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు, తిరిగి పాఠశాల నుంచి పిల్లలను తీసుకొచ్చేటప్పుడు ఒంటిపై బంగారు నగలు వేసుకుని వెళ్లరాదన్నా రు. అదే విధంగా దేవాలయానికి వెళ్లే సమయంలో కూడా నగలు ధరించి వెళ్లరాదని సూచించారు. ఉదయం ఇంటి ముగ్గులు వేసే సమయంలో, దంపతులు వాకింగ్ చేసే సమయంలో, కార్యాల యం, కళాశాలలకు ఒంటరిగా వెళుతున్న సమయంలో చైన్ స్నాచింగ్‌లు దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయని, ఇ లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేం దుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల న్నారు.
తమ ప్రాంతాల్లో ఎవరైనా తెలియని వ్యక్తి తిరుగుతున్నట్లు కనిపిస్తే, మట్కా, పేకాట ఆడుతున్నా వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారమందించాలన్నారు. అనంతరం ఎస్‌ఐ జోషి మాట్లాడుతూ ఇంట్లో బంగా రు ఆభరణాలను ఉంచరాదని, బ్యాంక్ లాకర్‌లో ఆభరణాలను ఉంచాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెఎం హమీ ద్, సీఆర్‌పీ అధికారి రాధా మనోహర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్‌ఐ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోండి
Published Wed, Dec 11 2013 3:02 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement