hospet
-
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. పోటెత్తిన నీరు
హోస్పేట్/కర్నూలు: కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ఊడిపోవడంతో నీరు బయటికి పోటెత్తింది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి డ్యామ్ గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ సమయంలో 19వ గేటు చైన్ తెగి గేటు మొత్తం కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయాన్నే డ్యామ్‌ను కొప్పాల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శివరాజ్ సందర్శించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు బయటికి పోతోంది. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అవసరమైతే సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్లు 1070,112, 18004250101 సంప్రదించాలని సూచించింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని కోరింది. -
బాలికపై నలుగురు బాలుర సామూహిక అత్యాచారం!
బళ్లారి(కర్ణాటక): హాస్టేటలోని ఓ బహిరంగ ప్రదేశంలో ఓ బాలికపై నలుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బళ్లారి ఎస్పీ చేతన్ సింగ్ రాథోడ్ కథనం ప్రకారం హాస్టేట ఎన్సీ కాలనీకి చెందిన 9 ఏళ్ల విద్యార్థినికి శనివారం అదే కాలనీకి చెందిన నలుగురు బాలురు చాక్లెట్లు ఇస్తామని ఆశ చూపించి సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. నలుగురూ ఆ బాలికపై సామూహికంగా అత్యాచారం చేశారు. నిందితులు నలుగురూ పది నుంచి 13 సంవత్సరాల వారే. వివిధ పాఠశాలలలో చదువుతున్న వారు బాధితురాలికి ఇరుగుపొరుగున ఉండేవారే. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ** -
హంపి ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
హొస్పేట, న్యూస్‌లైన్ : హంపిలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని బళ్లారి జిల్లా ఇన్చార్జ్, కార్మిక శాఖ మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన హంపిలో జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. హంపి ఉత్సవాల్లో బళ్లారి జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, తాలూకా పంచాయతీల ప్రజా ప్రతినిధులు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే ఉత్సవాల వేదిక పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఉత్సవాల్లో జిల్లా కళాకారులకు మొదట ప్రాధాన్యత కల్పించామన్నారు. 10న ప్రధాన వేదిక అయిన శ్రీకృష్ణదేవరాయ వేదికపై ఉత్సవాలు ప్రారంభవమవుతాయన్నారు. ఉత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభిస్తార ని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ఉత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తోరణగల్లు-కురేకుప్ప సమీపంలో హెచ్ఎల్సీపై రోడ్డు వంతెన మరమ్మతులను ఈ ఉత్సవాల లోపు ముగించాలని నిర్ణయించామని, కానీ కాలువలో నీరు ప్రవహిస్తుండడంవల్ల ఈ ఉత్సవం లోపు వంతెన పనులు పూర్తి చేయలేకపోతున్నామన్నారు. కాలువకు నీటిని బంద్ చేసిన అనంతరం వంతెన పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ఉత్సవాల్లో ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారన్నారు. సుమారు రూ.7.30 కోట్ల ఖర్చుతో ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నామన్నారు. నాలుగు వేదికల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లాధికారి ఏఏ.బిస్వాస్, జిల్లా ఎస్పీ చేతన్‌సింగ్ రాథోర్, హొస్పేట నగర అసిస్టెంట్ కమిషనర్ సునీల్‌కుమార్, తహ శీల్దార్ రమేష్ కోనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోండి
హొస్పేట, న్యూస్‌లైన్ : ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక టౌన్ సీఐ శ్రీధర్దొడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పటేల్‌నగర్ ప్రభుత్వ శ్రీరాములు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘ప్రమాదాల నియంత్రణ’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పరిచ యం లేని వ్యక్తులు విద్యార్థులకు తినడానికి చాక్లెట్లు, బిస్కెట్లు తదితర తినుబండారాలు ఇస్తే తీసుకోరాదని సూచించా రు. మహిళలు తమ పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు, తిరిగి పాఠశాల నుంచి పిల్లలను తీసుకొచ్చేటప్పుడు ఒంటిపై బంగారు నగలు వేసుకుని వెళ్లరాదన్నా రు. అదే విధంగా దేవాలయానికి వెళ్లే సమయంలో కూడా నగలు ధరించి వెళ్లరాదని సూచించారు. ఉదయం ఇంటి ముగ్గులు వేసే సమయంలో, దంపతులు వాకింగ్ చేసే సమయంలో, కార్యాల యం, కళాశాలలకు ఒంటరిగా వెళుతున్న సమయంలో చైన్ స్నాచింగ్‌లు దొంగతనాలు అధికంగా జరుగుతున్నాయని, ఇ లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేం దుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల న్నారు. తమ ప్రాంతాల్లో ఎవరైనా తెలియని వ్యక్తి తిరుగుతున్నట్లు కనిపిస్తే, మట్కా, పేకాట ఆడుతున్నా వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు సమాచారమందించాలన్నారు. అనంతరం ఎస్ఐ జోషి మాట్లాడుతూ ఇంట్లో బంగా రు ఆభరణాలను ఉంచరాదని, బ్యాంక్ లాకర్లో ఆభరణాలను ఉంచాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెఎం హమీ ద్, సీఆర్పీ అధికారి రాధా మనోహర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్ఐ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.