
చెన్నై: కరోనా మహమ్మారి తమిళనాడును కలవరపెడుతోంది. రోజులు గుడుస్తున్న కొద్ది రాష్ట్రంలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడులో గత 24 గంటల్లో 3,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 64 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కు చేరుకోగా.. కరోనాతో పోరాడి ప్రాణాలు వదిలిన వారి సంఖ్య 1,700కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాగా.. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో 46,480 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 74,167 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: కరోనా: పరిస్థితులు చేజారిపోయాయా..!
Comments
Please login to add a commentAdd a comment