
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,680 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 64 మరణాలు నమోదైనట్లు శుక్రవారం రోజున ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,30,261కు చేరుకుంది. ఇందులో 46,105 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 82,324 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,829 మరణాలు నమోదయ్యాయి. చదవండి: మరో మంత్రికి కరోనా పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment