రీసెర్చ్ స్కాలర్ రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ వీసీ
దుగ్గొండి: రీసెర్చ్ స్కాలర్ రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, సెంట్రల్ వర్సిటీ వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచంద్రారావులను అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తమ్మినేని నేతృత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళ వారం వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలంలో సా గింది. గిర్నిబావిలో నిర్వహించిన రోహిత్ ప్రథమ వర్ధంతి సభలో తమ్మినేని మాట్లా డారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఒక్కటై కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు.
గత పాలకుల ఒరవడే..
సాక్షి, హైదరాబాద్: గత పాలకులు ఎస్సా రెస్పీ రెండోదశలో భాగంగా డీబీఎం 48 కాల్వలనిర్వహణకు ఏటా రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వాలు లెక్కలు చూపేవని, కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే లెక్కలు చూపుతోందని మంగళవారం సీఎం కు రాసిన లేఖలో తమ్మినేని పేర్కొన్నారు.