సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నిర్ణీత గడువులోగా ప్రభుత్వ సేవలను అందించే ‘సకాల’ పథకాన్ని సచివాలయానికి కూడా విస్తరించాలని యోచిస్తున్నట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర తెలిపారు. జూన్ నెలకు సకాల నివేదికను విడుదల చేసిన అనంతరం మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సకాల సేవల దారృ సంతప్తి చెందిన పౌరులకు సకాల మిత్ర అనే గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తద్వారా వారు సకాలపై నృ జాగతికి రాయబారుల్లాగా వ్యవహరిస్తారని చెప్పారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌లో సకాల సేవలను వినియోగించుకోవడంలో నియోజక వర్గాల వారీగా గాంధీ నగర ప్రథమ, చిక్కబళ్లాపురం ద్వితీయ, తుమకూృు తతీయ స్థానాల్లో నిలిచాయని వివరించారు. ఈ నెలలో మొత్తం 5.5 లక్షల అర్జీలు అందగా, 5.42 లక్షలు పరిష్కారమయ్యాయని ఆయన వెల్లడించారు.
న్యాయ విచారణపై ఆదేశాలు
అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్ వ్యవహరంపై న్యాయ విచారణకు రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు వెలువడుతాయని మంత్రి తెలిపారు. ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తులెవరూ అందుబాటులో లేనందున, విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు చేయిస్తామని చెప్పారు. ఐదారు మంది విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దీనిపై బుధవారం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
సచివాలయానికీ సకాల!
Published Wed, Aug 6 2014 4:02 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement