ఏపీ రాజధానిలో టీడీపీ ధర్నా
Published Thu, Oct 27 2016 11:19 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనమాక గ్రామంలో రాజధాని రహదారిలో టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. తవ్వేసిన రోడ్లను వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ వచ్చేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ ధర్నాలో పెనమాక గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అంతా పాల్గొంది. సాక్షాత్తూ అధికారపార్టీ కార్యకర్తలు, నాయకులే రోడ్ల పరిస్థితిపై ధర్నా దిగుతుండటంతో అధికారులకు ఏంచేయాలో పాలుపోవడం లేదు.
Advertisement
Advertisement