
ఎంపీ జేసీ అరెస్ట్, ఆస్పత్రికి తరలింపు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేపట్టిన దీక్షను సోమవారం పోలీసులు భగ్నం చేశారు.
అనంతపురం : అనంతపురంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేపట్టిన దీక్షను సోమవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు.
పట్టణంలోని పాతూరు తిలక్‌రోడ్డు, గాంధీ బజార్ రోడ్డు విస్తరణ జాప్యంపై ఎంపీ జేసీ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరవధిక నిరసన దీక్షకు దిగారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని జేసీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సీఎం విస్తరణ కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.