నాకు టీడీపీ సభ్యత్వం ఇచ్చింది ఆయనే.. | telangana minister thummala nageswara rao on madar saheb | Sakshi
Sakshi News home page

నాకు టీడీపీ సభ్యత్వం ఇచ్చింది ఆయనే..

Published Mon, Oct 17 2016 4:00 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

నాకు టీడీపీ సభ్యత్వం ఇచ్చింది ఆయనే.. - Sakshi

నాకు టీడీపీ సభ్యత్వం ఇచ్చింది ఆయనే..

తనకు ఆ నాడు టీడీపీ సభ్యత్వం ఇచ్చిన వ్యక్తి మదార్‌సాహెబ్‌ అని, నేడు మనముందు ఆయన లేకపోవడం బాధాకరమని రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

ఖమ్మం వైరారోడ్‌ : తనకు ఆ నాడు టీడీపీ సభ్యత్వం ఇచ్చిన వ్యక్తి మదార్‌సాహెబ్‌ అని, నేడు మనముందు ఆయన లేకపోవడం బాధాకరమని రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక ఎంఎంఆర్‌ ఫంక్షన్ హాల్లో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బీ బేగ్‌ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో మంత్రి మాట్లాడారు. మదార్‌ సాహెబ్‌ 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ పదవి ఇచ్చినా క్రమశిక్షణతో కట్టుబడి పార్టీ నియమాల ప్రకారం పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు.
 
విద్యార్థి దశలోనే తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. సంతాప సభలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మె ల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మా ట్లాడారు. తాళ్లూరి వెంకటేశ్వరరావు, బోడేపుడి రమేష్‌బాబు, మచ్చా శ్రీను, కేవీ రత్నం, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి, కమర్తపు మురళి తదితరులు  పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement