జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సోమవారం ఉదయం గండిపడింది.
జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సోమవారం ఉదయం గండిపడింది. మాక్లూరు మండలం అమర్థ్ గ్రామం వద్ద గండి పడటంతో.. సోయా, వరి పంటు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గండి పడ్డ ప్రాంతాన్ని సందర్శించారు. గండిని వెంటనే పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని.. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.