జిల్లా వ్యాప్తంగా 195 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
బహిరంగ ప్రచారానికి తెర
అభ్యర్థులకు టెన్షన్...టెన్షన్
జిల్లాలో భారీ పోలీసు బందోబస్తు
సాక్షి, బళ్లారి : ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగేందుకు కేవలం ఒక రోజు మాత్రమే గడువు ఉంది. జిల్లా వ్యాప్తంగా జూన్ 2వ తేదిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత 15 రోజులుగా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. బళ్లారి జిల్లా వ్యాప్తంగా సిరుగుప్ప, బళ్లారి, సండూరు, హగరిబొమ్మనహళ్లి, కూడ్లిగి, కంప్లి, హొస్పేట, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాల పరిధిలోని 196 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, అందులో బళ్లారి తాలూకాలోని కప్పగల్ గ్రామ పంచాయతీ మొత్తం 19 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో 195 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
196 గ్రామ పంచాయతీలకు 3691 గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఇందులో 464 మందిని జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకున్నారు. మిగిలిన 3215 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండటంతో మొత్తం దాదాపు 8వేలకు పైగా సభ్యులు పోటీ పడుతున్నారు. వేలాది మంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ఏ గ్రామంలో చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వారం, పది రోజులుగా ఎన్నికల ప్రచారంలో ముని గిపోయిన అభ్యర్థులకు రేపు ఎన్నికలు జరగనుండటంతో టెన్షన్ మొదలైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతున్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ తమ పార్టీలకు చెందిన మద్దతుదారులను గెలి పించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ శ్రేణులు విస్తృతం గా ప్రచారం చేస్తూ, తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లుకు విన్నవించడం జరిగింది.
అభ్యర్థుల తమ అదృష్టాన్ని ఓటరు తీర్పు ఇచ్చేందుకు మరి కొన్ని గం టలే గడువు ఉండటంతో బహిరంగ ప్ర చారానికి తెరపడటంతో, ఇక ఇంటింటా ఒక రోజు ప్రచారం చేయడానికి సన్నద్దం అయ్యారు. ఓటర్లకు ఎరవేసేందుకు కూ డా అభ్యర్థులు పూనుకుంటున్నారు. ఓట రుకు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో పో టీ హోరా హోరీగా ఉండటంతో ఒక్కో వార్డు మెంబరు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బడా నేతలు పోటీ చేస్తున్న పంచాయతీల్లో ఒక్కొ ఓటరుకు అసెంబ్లీ ఎన్నికల్లో పంపిణీ చేసినట్లుగా రూ.500 నుంచి రూ.1000లు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. ఇది ఇలా ఉండగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.బళ్లారి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకుని ఉండటంతో సరిహద్దు ప్రాంతాలైన సిరుగుప్ప, బళ్లారి తాలూకాలో గట్టి బందోబస్తుతో పాటు ఆయా చెక్‌పోస్టుల వద్ద మరింత భద్రతను పెంచారు. ఎస్‌పీ ఆర్ చేతన్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తును పట్టిష్టం చేశారు. సోమవారం సాయంత్రం కల్లా ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆయా గ్రామ పంచాయతీలకు వెళ్లేందుకు సిద్దం చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
రేపే గ్రామ పంచాయతీ ఎన్నికలు
Published Mon, Jun 1 2015 5:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement