షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం | The risk of fire in a shopping complex | Sakshi
Sakshi News home page

షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Published Wed, Jul 22 2015 2:36 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం - Sakshi

షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

సాక్షి, ముంబై : బాంద్రా లింక్ రోడ్డుపై ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ కొంత మేర ఆస్తినష్టం వాటిల్లింది. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లు, పది నీటి ట్యాంకర్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

చూస్తుండగానే పక్కనున్న మరో మూడు దుకాణాలను మంటలు చుట్టుముట్టాయని, పొగ కమ్ముకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా షాపింగ్ కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement