కోట్లలో నష్టం.. హైదర్‌నగర్‌లో ఘటన | Haidarnagarlo the event of a loss of crores | Sakshi
Sakshi News home page

కోట్లలో నష్టం.. హైదర్‌నగర్‌లో ఘటన

Published Mon, Sep 26 2016 12:50 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

కోట్లలో నష్టం.. హైదర్‌నగర్‌లో ఘటన - Sakshi

కోట్లలో నష్టం.. హైదర్‌నగర్‌లో ఘటన

హైదరాబాద్: షార్ట్ సర్క్యూట్‌తో నగరంలోని ఓ షాపింగ్‌మాల్‌లో మంటలు ఎగసిపడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బల్కంపేటకు చెందిన అశోక్ పాటిల్ కేపీహెచ్‌బీ లోని ధర్మారెడ్డి కాలనీలో శారదా సెలక్షన్‌‌స పేరుతో క్లాత్ షోరూంను నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో షాపింగ్‌మాల్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

దీన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా, అప్పటికే సుమారు రెండున్నర కోట్ల విలువైన దుస్తులు దగ్ధమైనట్లు నిర్వాహకుడు పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement