దారి దోపిడీలు..! | thieves hulchul in adilabad district | Sakshi
Sakshi News home page

దారి దోపిడీలు..!

Published Fri, Oct 14 2016 10:08 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

thieves hulchul in adilabad district

  • రాత్రి వేళల్లో బెదిరించి.. వసూళ్లు     
  • ఆందోళనలో ప్రయాణికులు
  • ఇటీవల ఓ వ్యక్తి నుంచి డబ్బులు వసూళ్లు    
  • లేదంటే వంతెన పైనుంచి పడేస్తామని బెదిరింపులు
  •  
     
    ఆదిలాబాద్ రూరల్ : మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్డు మా ర్గాల్లో రాత్రుల్లు దారి దోపీడీలు జరుగుతున్నా యి. చీకటిలో మాటు వేసి ఒం టరి వారిని గమనించి దా డికి పాల్పడి నగదు, ఆభరణాలను దోచుకుంటున్నా రు. లేదని మొండికేస్తే చం పేస్తామని, వంతెన పై నుంచి పడేస్తామాని కత్తులు చూపి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
     
    ఇటీవల లాండసాంగ్వి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం లో ఇండియాన్ గ్యాస్‌కు సమీపంలో ఉన్న వంతెన వద్ద గుర్తు తెలియాని వ్యక్తులు కాపు కాసి దోపీడికి పాల్పడ్డారు. లాండసాంగ్వి గ్రామానికి చెందిన ఓ యువకుని వద్ద నుంచి బెదిరించి నగదును అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ రోడ్డు గుండా లాండసాంగ్వి, అర్లి(బి) గ్రామాలతో పాటు జైనథ్ మండలంలోని అడ, కంఠ, ముక్తపూర్ గ్రామాల ప్రజలు ప్రతి రోజు రాకపోకలు నిర్వహిస్తుంటారు.
     
    ఇటీవల దొంగతనం జరిగిన  వంతెన వద్ద గుంతలు ఉండడంతో వాహనాల వేగాన్ని తగ్గించాల్సి వస్తోంది.  అంతకంటే ముందే వంతెన కింద కపుకాసి ఉన్న వారు వాహన వేగం తగ్గే సారికి దగ్గరికి వచ్చి దోచుకుంటున్నారు.  ఈ గ్రామాలకు వెళ్లే ప్రయానికులు ఆందోళన చెందు తున్నామని, రాత్రి వేళల్లో  రక్షణ కల్పిం చాలని కోరుతున్నారు.
     
     
    ప్రజలకు రక్షణ కల్పిస్తాం
    ప్రజలు ఎలాంటి ఆం దోళనలు చెందాల్సిన అవసరం లేదు. వారి కి పూర్తి రక్షణను కల్పిస్తాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలి. లాండసాంగ్వి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం లో దోపీడీలు జరుగుతున్నాయాని తన దృ ష్టికి రాలేదు. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తాం.   
     - తోట తిరుపతి, ఎస్సై ఆదిలాబాద్
     
    చంపేస్తామన్నారు
    నేను ఆదిలాబాద్ పట్టణంలో హోటల్ నడుపుతాను. కొన్ని రోజుల కింద రాత్రి వేళల్లో ఒంటరిగా వస్తున్నాను. వంతెన వద్ద కాపు కాసిన కొంత మంది వ్యక్తులు బండి అపుమన్నారు. ముందుగా డబ్బులు అడిగారు. నేను లేదన్నాను. ఇవ్వకపోతే వంతెనపై నుంచి ఎత్తేస్తామాని నన్ను లేపారు. వంతెన పై నుంచి పడేస్తారేమోనని భయంతో నా వద్ద ఉన్న ఆరు వేలు ఇచ్చేశాను.        
     - నగేష్, లాండసాంగ్వి
     
    ఆందోళన చెందుతున్నాం
    నేను ప్రతి రోజు జిల్లా కేంద్రానికి రాకపోకలు నిర్వహిస్తాను. ఏమైనా ఆలస్యం జరిగితే రాత్రి వరకు ఆగాల్సివస్తోంది. మొన్న మా గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి బెదిరించి డబ్బులు గుంజుకున్నారు. రాత్రి అయిందంటే భయ పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పోలీసులు నిఘా ఉంచి అలాంటి వారిని పట్టుకొని శిక్షించాలి.
     - జె. నర్సీంగ్, లాండసాంగ్వి
     
    పెట్రోలింగ్ నిర్వహించాలి
    మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి రాకపోకలు నిర్వహిస్తున్నాం. ఏ రాత్రి వచ్చిన గతంలో ఎలాంటి భయం ఉండేది కాదు. ఈ మధ్య కాలంలో దొంగతనాలు జరుగుతున్నాయి. రాత్రి అయిందంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
     - రాంసం గంగారాం, లాండసాంగ్వి,
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement