శంకర్‌పై హిజ్రాల ధ్వజం | Transgender community to file complaint against Shankar' | Sakshi
Sakshi News home page

శంకర్‌పై హిజ్రాల ధ్వజం

Published Sun, Jan 18 2015 10:52 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM

శంకర్‌పై హిజ్రాల ధ్వజం - Sakshi

శంకర్‌పై హిజ్రాల ధ్వజం

దర్శకుడు శంకర్‌పై హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఐ. ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సంతానం హాస్యపాత్ర పోషించారు. ఆస్కార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో హిజ్రాపాత్రను ప్రతినాయకుల్లో ఒకరిగా శంకర్ చిత్రీకరించారు. ఆ పాత్రను నిజమైన హిజ్రా ఓఐఎస్ రాజాణితోనే నటింప చేశారు. ఈమె ప్రముఖ మోడల్ మాత్రమే కాకుండా ప్రముఖ నటీమణులు ఐశ్వర్యారాయ్ తదితరులకు ప్యాషన్ డిజైనర్ కూడా. ఐ చిత్రంలో విక్రమ్‌ను మోడల్‌గా తీర్చిదిద్దే పాత్రలో నటించిన రాజాణి ఆయన్ని ప్రేమిస్తున్నట్లు విక్రమ్ ఆమెను అసహ్యించుకున్నట్లు చిత్రీకరించారు.
 
 దీంతో ఆమె ప్రతినాయకులతో కలసి ఆయన్ని నాశనం చేసే కుట్రలో పాలుపంచుకుంటుంది. ఈ సన్నివేశాలు హిజ్రాలను కించపరిచే విధంగాను, మనోభావాలు దెబ్బతినేలాగా ఉన్నాయంటూ హిజ్రా సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో అనాది నుంచి సమాజం హిజ్రాలను చిన్న చూపు చూస్తూనే ఉందన్నారు. చాలా సినిమాల్లోనూ హిజ్రాలను అవమానిస్తూ చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఐ చిత్రంలో హాస్యనటుడు సంతానం హిజ్రాలను అవహేళన చేసే విధంగా సంభాషణలు చెప్పి కించపరిచారని వాపోయారు. అందుకే ఈ వ్యవహారంపై దర్శకుడు శంకర్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేయనున్నట్లు  పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి హిజ్రాలు చెన్నైకి రానున్నారని సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement