డోంట్ బ్రీత్ అననున్న విక్రమ్ | Vikram will undergo a transformation for Don't Breathe remake | Sakshi
Sakshi News home page

డోంట్ బ్రీత్ అననున్న విక్రమ్

Published Thu, Oct 20 2016 1:33 AM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

డోంట్ బ్రీత్ అననున్న విక్రమ్ - Sakshi

డోంట్ బ్రీత్ అననున్న విక్రమ్

చియాన్‌గా అభిమానులు భుజాలపై మోసుకుని ఆనందపడుతున్న నటుడు విక్రమ్. ఇటీవల సరైన విజయాలు లేక నిరుత్సాహంతో ఉన్న ఆ వెర్స్‌టెయిల్ నటుడిని తాజాగా విడుదలైన ఇరుముగన్ సంతోషాల్లో ముంచేసింది. దీంతో నూతనోత్సాహంతో తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. జయాపజయాల మాట అటుంచితే విక్రమ్ తన చిత్రాల్లో వైవిధ్యం కోసం తపిస్తాడన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే విధంగా తన పాత్రల్లో జీవం కోసం నిరంతరం శ్రమించే నటుడాయన. ఇరుముగన్ చిత్రం తరువాత విక్రమ్ నటించే చిత్రం ఏమిటన్న విషయంపై రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి.
 
  సోక్రటీస్ దర్శకత్వంలో చిత్రం చేయనున్నారనే ప్రచారం అందులో ఒకటి. అయితే అది ప్రచారానికే పరిమితమైంది. ఇక విక్రమ్‌ను కమర్షియల్ హీరోను చేసిన చిత్రాలలో సామి ఒకటి. ఆ చిత్రానికి సీక్వెల్‌గా హరి దర్శకత్వంలో విక్రమ్ నటించనున్నారు. దీన్ని ఇరుముగన్ చిత్ర నిర్మాత శిబు తమీన్స్ నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి ముందు విక్రమ్ మరో చిత్రం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమచారం. అదే హాలీవుడ్ సంచలన చిత్రం డోంట్ బ్రీత్‌కు రీమేక్. డోంట్ బ్రీత్ చిత్రం హాలీవుడ్‌లోనూ కాదు భారతదేశంలోనూ సంచన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం తమిళంలోకి అనువాదమై విశేష ఆదరణను పొందింది.
 
  ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో విక్రమ్ కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారట. డిసెంబర్ నెలలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. దీంతో విక్రమ్ ఇప్పటి నుంచే ఆ పాత్రకు తగ్గట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ను మలచుకోవడానికి జిమ్‌లో కసరత్తు మొదలెట్టారనీ సమాచారం. ఇక పోతే ఇరుముగన్ చిత్రంతో తనకు విజయాన్ని అందించిన ఆనంద్‌శంకర్‌నే ఈ చిత్ర మెగాఫోన్ బాధ్యతలు అప్పగించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement