నిరంతర స్ఫూర్తిప్రదాత కలాం: వైఎస్ జగన్ | Truly Abdul Kalam is an inspiration forever, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నిరంతర స్ఫూర్తిప్రదాత కలాం: వైఎస్ జగన్

Published Sat, Oct 15 2016 10:04 AM | Last Updated on Mon, Aug 20 2018 5:43 PM

నిరంతర స్ఫూర్తిప్రదాత కలాం: వైఎస్ జగన్ - Sakshi

నిరంతర స్ఫూర్తిప్రదాత కలాం: వైఎస్ జగన్

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి ఎప్పటికీ అలాగే నిలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి కొనియాడారు. అక్టోబర్ 15న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. అబ్దుల్ కలాం పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 
 
2015 జూలై15న షిల్లాంగ్లోని ఐఐఎంలో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం కుప్పకూలారు. అనంతరం బెధాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.1931 అక్టోబర్ 15న ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement