
లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరి మృతి
ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు.
తాడేపల్లి(గుంటూరు): రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పాత టోల్‌గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. విజయవాడ రామప్పాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్‌పై గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నారు. 45వ నంబర్ జాతీయ రహదారిపై పాత టోల్‌గేట్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వద్ద లభించిన లైసెన్స్ ఆధారంగా ఓ విద్యార్థి పేరు నవీన్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.