డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడరాదు
Published Fri, Nov 15 2013 3:44 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
వేలూరు, న్యూస్‌లైన్: వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించడం పూర్తిగా నిషేధించాలని వీఐటీ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు జీవీ సెల్వం అన్నారు. వేలూరులో వొడాఫోన్ రోటో స్టోర్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వొడాఫోన్ రోటో స్టోర్ ఆధ్వర్యంలో చిన్నారులకు వ్యాసచరన, వక్తృత్వ, డ్రాయింగ్, మిమిక్రీ, ఒక నిమిషంలో విజయం సాధించే పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి మానవుని చేతిలోను సెల్‌ఫోన్‌లు ఉన్నాయన్నారు. సెల్‌ఫోన్‌లను మంచి విషయాలకే ఉపయోగించాలన్నారు. వొడాఫోన్ రోటో స్టోర్ ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వొడాఫోన్ తమిళనాడు మార్కెటింగ్ చైర్మన్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ 150 మిలియన్ వినియోగదారులకు సేవలు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వొడాఫోన్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement