వైరల్‌ వీడియో: ఇరగదీశాడు! | Viral Video: Karnataka Farmer Sings Justin Bieber Song | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: ఇరగదీశాడు!

Published Tue, Dec 17 2019 2:52 PM | Last Updated on Tue, Dec 17 2019 3:17 PM

Viral Video: Karnataka Farmer Sings Justin Bieber Song - Sakshi

యూట్యూబ్‌ వీడియో ఫొటో

సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఒక్క వీడియోతో రణు మొండాల్‌ అనే మహిళ రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది. ఆమెలోని ప్రతిభను ప్రపంచం ముందుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేయడంలో సోషల్‌ మీడియా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. తాజాగా కర్ణాటక రైతు ఒకరు పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ప్రఖ్యాత పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ 2009లో పాడిన ‘బేబి’ పాటను హావభావాలతో అచ్చం అలాగే పాడి అందరినీ ఆకట్టుకున్నాడు ఆ రైతు. ఎంఎస్‌ ఇసాయ్‌ పల్లి అనే వ్యక్తి యూట్యూబ్‌లో ఈ వీడియోను డిసెంబర్‌ 13న షేర్‌ చేశారు. 3 నిమిషాల 10 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోకు లక్షకుపైగా వ్యూస్‌ వచ్చాయి. పొలంలో పని చేసుకుంటున్న రైతు దగ్గరికి వెళ్లి పాట పాడమని కన్నడంలో అడిగినట్టు వీడియోలో ఉంది. అతడి కోరిక మేరకు రైతు.. జస్టిన్‌ బీబర్‌ పాటను పాడాడు. రైతు పాడిన పాప్‌ సాంగ్‌కు వీక్షకులు ఫిదా అవుతున్నారు.

బీబర్‌ పాటను దించేసిన రైతును మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. బీబర్‌ పాటనే ఇంత బాగా ఆలపించాడంటే మిగతా పాటలు కూడా బాగా పాడగలడని అన్నారు. ఇప్పటికీ పదిసార్లుపైగా ఈ వీడియో చూశానని, మళ్లీమళ్లీ చూస్తున్నానని ఒకరు వెల్లడించారు. జస్టిన్‌ బీబర్‌ కంటే బాగా పాడాడని, అతడు కొత్త జతిన్‌ బీబర్‌ అని మరొకరు మెచ్చుకున్నారు. మన దేశంలో కాకుండా విదేశాల్లో ఉంటే అతడు చాలా పాపులర్‌ అయ్యేవాడని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. ఇదంతా కట్టుకథలా ఉందని కొద్దిమంది అనుమానం వ్యక్తం చేశారు. సౌండ్‌.. ఆటో ట్యూన్‌లా ఉందని, ఫేక్‌ వీడియో అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement