'సుజిత్‌.. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయాం' | We Couldnt See Sujith Wilson Face For The Last Time Because Body Was Badly Decomposed In Tamilandu | Sakshi
Sakshi News home page

'సుజిత్‌.. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయాం'

Oct 29 2019 2:08 PM | Updated on Oct 29 2019 2:33 PM

We Couldnt  See Sujith Wilson Face For The Last Time Because Body Was Badly Decomposed In Tamilandu - Sakshi

చెన్నై : బుడి బుడి అడుగులు వేస్తున్న ప్రాయం సుజిత్‌ విల్సన్‌ది. అమ్మా, నాన్న తప్ప మరో ప్రపంచం వాడికి తెలియదు. తండ్రి చెంతన ఆడుకుంటున్న బాలుడు అనుకోకుండా గత శుక్రవారం 25న బోరుబావిలో పడ్డాడు. అదే అతని పాలిట మృత్యువు అవుతుందని ఊహించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సుజిత్‌ను ఎలాగైనా సురక్షితంగా బయటకు తీసుకురావాలని సహాయక చర్యలు చేపట్టింది. తమిళనాడు మాత్రమే కాదు యావద్దేశం సుజిత్‌ ప్రాణాలతో బయటికి రావాలని దేవుడిని ప్రార్థించారు. ప్రధాని మోదీ కూడా సుజిత్‌ ఏ ఆటంకం లేకుండా సురక్షితంగా బయటకు రావాలని దేవుడిని కోరినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఇంతమంది దీవేనలు ఉండగా తన బిడ్డకు ఏం కాదని సుజిత్‌ తల్లి కళామేరీ భావించింది. కానీ వారి ప్రార్థనలను దేవుడు కరుణించలేదు. మూడు రోజులపాటు ఆహారం లేక, ఆక్సిజన్‌ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుజిత్‌ మంగళవారం మరణించినట్లు అధికారులు వెల్లడించారు. 
(చదవండి : రెండేళ్ల సుజిత్‌ కథ విషాదాంతం)

ఇదే విషయమై కుటుంబసభ్యులను సంప్రదించగా.. తాము సుజిత్‌ను ఆఖరి చూపుకు కూడా నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా సుజిత్‌ బోరుబావిలో ఉండడంతో అతని మృతదేహం కుళ్లిపోయింది. దీంతో అతని శరీరాన్ని పూర్తిగా ప్లాస్టిక్‌ కవర్‌తో కప్పివేశారని సుజిత్‌ ఆంటీ జూలియా తెలిపారు. ఈ భాద నుంచి మేము అంత తొందరగా బయటికి రాలేమని,  వాడి జ్ఞాపకాలు మమ్మల్ని కొంతకాలం వెంటాడుతాయని  పేర్కొన్నారు. సుజిత్‌ మృతి వార్త విన్న అతని తల్లి కళామేరీ జీవశ్చవంలా తయారైందని జూలియా చెప్పుకొచ్చారు. 'నేను రాష్ట్ర  ప్రభుత్వాని​కి ఒక విషయం మనవి చేస్తున్నా. సుజిత్‌ లాంటి పరిస్థితి ఇక మీదట ఎవరికి రాకుండా రాష్ట్రంలోని బోరు బావిలను వెంటనే మూసేయాలి. మాలాంటి కడుపుకోత ఎవరికి రావద్దని' కోరుకుంటున్నట్లు సుజిత్‌ అంకుల్‌ సునారిముత్తు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement