చెన్నైలో జననేతకు జై
Published Wed, Sep 25 2013 6:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
జననేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదల కావడంతో చెన్నైలోని అభిమానులు ఆనంద పారవశ్యంలో మునిగిపోయూరు. పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. జై జగన్..జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి పెట్టారు.
సాక్షి, చెన్నై: దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మరణం ఇక్కడి వారిని సైతం శోకసంద్రంలో ముంచింది. వైఎస్ కుటుంబానికి జరుగుతూ వచ్చిన అన్యాయాన్ని చూసి ఇక్క డి అభిమాన లోకం తల్లడిల్లింది. మహానేత తనయుడు, వైఎస్‌ఆర్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి బెయిల్ లభించిందన్న సమాచారంతో చెన్నైలో అభిమానులు ఆనందంలో మునిగిపోయూరు. జననేతను చూసేందుకు మంగళవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయారు. ఎప్పుడెప్పుడు జననేతను చూద్దామా అని తపించారు. సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు జగన్ జైలు నుంచి బయటకు అడుగు పెట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు. రోడ్ల మీదకు పరుగులు తీశారు. బాణసంచా పేల్చారు. మిఠారుులు పంచిపెట్టారు.
సంబరాలు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నేతలు జాకీర్ హుస్సేన్, శరవణన్ నేతృత్వంలో పెరంబూరు ఎస్‌ఎస్ నగర్‌లో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. స్వీట్లు పంచి పెట్టారు. జగన్ ఈజ్ బ్యాక్ నినాదంతో రూపొందించిన పోస్టర్లను నగరంలో ఏర్పాటు చేశారు. బుధవారం అన్నదానానికి ఏర్పాట్లు చేశారు. ప్యారిస్ వరద ముత్తయప్పన్ వీధిలో వై.ఎస్.జగన్ అభిమానులు శివశంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి, రమణారెడ్డి, ఇమామ్ బాషా, పెంచుల్ రెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి నేతృత్వంలో సంబరాలు మిన్నంటారుు. వైఎస్, జగన్ చిత్రాలతో కూడిన ఫ్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. బాణసంచా మోత మోగించారు. ట్రిప్లికేన్‌కు చెందిన వైఎస్ అభిమానులు రామప్రసాద్, జనార్దన్ రెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, కొండారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరుల నేతృత్వంలో మూడు చోట్ల సంబరాలు జరుపుకున్నారు. ట్రిప్లికేన్ హైరోడ్డులో ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. బాణసంచా పేల్చారు.
పముఖ ఆడిటర్ జేకే రెడ్డి, ఆస్కా ట్రస్టీ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ స్థానిక సలహా మండలి సభ్యుడు ప్రభాకర్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బేతపుడి శేషప్రసాద్, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, రవి, నిర్మాత భాస్కర్‌రాజు తదితరులు టీ నగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద తమ ఆనందాన్ని పంచుకున్నారు. కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచి పెట్టారు. కొరుక్కుపేట కామరాజనగర్‌లోని అభిమానులు శ్రీను, దావేద్, వెంకటేష్, తిరుమలరావు, కన్నయ్య, అబ్రహం, మధు తదితరులు బాణసంచా పేల్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రోడ్డున వెళ్లే వారికి స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టారు. ప్యారిస్ ఆదియప్పన్ నాయకన్ వీధిలో వై.ఎస్.జగన్ అభిమాని కిషోర్‌రెడ్డి నేతృత్వంలో అన్నదానం చేశారు.
జగన్‌కు మద్దతుగా నినాదాలు హోరెత్తించారు. పాండిబజార్‌లోని తెలుగు వ్యాపారులు నాయుడు హాల్, అరుణా స్వీట్స్, రుషికా రెస్టారెంట్ పరిసరాల్లో చాక్లెట్లు పంచి పెట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు. టీనగర్ కన్నమపేట శ్రీనివాసపురంలో వైఎస్ అభిమానులు ప్రభాకర్, రమణయ్య, డీవీ అరుణ్‌కుమార్, వసంతకుమార్, సురేష్ అంథోని, సంపత్ కుమార్ స్వీట్లు పంచి పెట్టారు. కోయంబేడు, అరుబాక్కం, తాంబరం పరిసరాల్లోని అభిమానులు లడ్డూలు పంపిణీ చేశారు. జగన్ రాకతో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ఆయనకు తామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement