వాసన్‌తో సీతారాం ఏచూరి భేటీ
సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్‌ల మధ్య భేటీ సాగడంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ పక్షాలు పడ్డాయి. ఈ ఇద్దరి మధ్య రాజకీయ పరంగా సుదీర్ఘ చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
సాక్షి, చెన్నై : కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తమిళ మానిల కాంగ్రెస్ ద్వారా ప్రజల్లోకి దూసుకు వెళ్లే పనిలో పడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదు, బలోపేతం మీద దృష్టి పెట్టి సుడిగాలి పర్యటనలు చేసిన వాసన్, ఇప్పుడు పార్టీ కార్యవర్గం ఎంపిక కసరత్తుల్లో మునిగి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న కాంక్షతో గతంలో తన తండ్రి, దివంగత మూపనార్ వ్యవహరించినట్టుగానే ఫార్మూలాలను ప్రయోగించేందుకు కార్యచరణను సిద్ధం చేసుకుని ఉన్నారు. కాంగ్రెసేతర పార్టీల్ని తన వైపునకు తిప్పుకోవడం లేదా, బలమైన కూటమి పక్షాన నిలబడి ఎన్నికల్లో సత్తా చాటాలన్న కాంక్షతో ఉరకలు పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో తన నేతృత్వంలో బలమైన కూటమికి సైతం వాసన్ చాప కింద నీరులా ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగుతున్నది.
ప్రధానంగా యువతను ఆకర్షించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వాసన్ గత కొద్ది రోజులుగా వామపక్షాలతో సన్నిహితంగా మెలుగుతున్నారని చెప్పవచ్చు. వాసన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఓ సదస్సుకు వామపక్షాల నాయకులతో పాటుగా వీసీకే, పలువురు మైనారిటీ నాయకులు హాజరయ్యారు. మతత్వానికి వ్యతిరేకంగా ఏకం అవుదామని నాయకులు అందరూ పిలుపునిచ్చారు. దీంతో వాసన్ సారథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఆవిర్భవించడం ఖాయం అన్న సంకేతాలు బయలు దేరాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలోనే వాసన్ ప్రసంగాలు, వ్యాఖ్యలు సైతం ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి వాసన్ భేటి కావడంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి.
ఆంతర్యమేమిటో
వామపక్షాలు ఒకే గూటికి వచ్చి బీజేపీ, కాంగ్రెసేతర కూటమి లక్ష్యంగా జాతీయ స్థాయిలో పావులు కదిపేందుకు కార్యచరణ సిద్ధం అవుతున్న వేళ చెన్నైకు వచ్చిన సీతారాం ఏచూరి మైలాపూర్‌లోని తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) కార్యాలయంలో ఆ పార్టీ అధినేతతో భేటీ కావడంతో అందరి దృష్టి వాసన్ తదుపరి అడుగులు ఏమిటోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఈ ఇద్దరు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై సమీక్షించుకుని ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడం లక్ష్యంగా ఈ ఇద్దరి మధ్య పలు సూచనలు, సలహాలతో కూడిన సంభాషణలు సాగినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.
ఆంతర్యం ఏమిటో!
Published Mon, Apr 6 2015 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM
Advertisement
Advertisement