ప్రేమించి.. వేరొకరితో పెళ్లికి సిద్దమైందని..
ప్రేమించి.. వేరొకరితో పెళ్లికి సిద్దమైందని..
Published Fri, Jul 7 2017 6:34 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
చెన్నై: తమిళనాడులో ఓ ప్రేమోన్మాది పేట్రేగిపోయాడు. తనతో ప్రేమ వ్యవహారం నడిపి వేరొకరితో వివాహానికి అంగీకరించిందని తెలిసి ఆమెను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపంలోని సెలోరంపట్టిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న తంగారాజ్ కూతురు తమిళ(18) డిగ్రీ చదువుతుంది. ఈమె కొద్దిరోజులుగా మహేంద్రన్(24) అనే ల్యాబ్ టెక్నీషియన్‌ను ప్రేమిస్తుంది. అయితే ఇటీవల ఆమె తల్లితండ్రులు వేరే యువకుడితో పెళ్లి సంబంధం కుదిర్చారు.
ఇందుకు ఆమె కూడా ఒప్పుకుందని తెలిసిన మహేంద్రన్ ఆమెను పిలిపించుకుని పెళ్లి విషయం అడిగాడు. ఇద్దరి మధ్య ఈ విషంపై తగాదా వచ్చింది. దీంతో కోపాద్రిక్తుడైన మహేంద్రన్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె నోట్లో విషం పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం మహేంద్రన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం వెలుగులోకి వచ్చింది.
Advertisement
Advertisement