చెన్నైలో జగన్ యువ సేన | ys jagan Yuva sena in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో జగన్ యువ సేన

Published Wed, Sep 17 2014 12:52 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

చెన్నైలో జగన్ యువ సేన - Sakshi

చెన్నైలో జగన్ యువ సేన

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో జగన్ యువ సేన వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటయింది. దీనిని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రకటించారు. చెన్నైలో తమ సేవల్ని విస్తృతం చేయనున్నామని ఆ అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. తమిళనాడు ప్రజల్లో వైఎస్సార్ కుటుంబంపై ఎనలేని అభిమానం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ వైఎస్సార్ సీపీ నేతృత్వంలో సేవా కార్యక్రమాల్ని విస్తృత పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము సైతం అంటూ ఇక్కడి యువత, తెలుగు విద్యార్థులు కదిలారు. నగరంలోని కళాశాలల్లో చదువుకుంటున్న యువత జగన్ యువసేన పేరుతో తమ కార్యక్రమాలను చెన్నైలో విస్తృత పరిచేందుకు నిర్ణయించారు.
 
  డి సాయినాథ్‌రెడ్డి, బి రాజేష్ రెడ్డి, టీ నరేంద్రనాథ్ రెడ్డి కలసికట్టుగా ఈ యువసేనను ఏర్పాటు చేశారు. లోటస్ పాండ్‌లో సోమవారం తమ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా జగన్ యువసేన వెల్ఫేర్ అసోసియేషన్ నినాదంతో కూడిన టీ షర్టును విడుదల చేశారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని, చెన్నైలోని తెలుగు ప్రజలకు సహకారం అందించే విధంగా ముందుకు సాగాలని తమకు అధినేత జగన్ మోహన్ రెడ్డి సూచించారని యువసేన ప్రతినిధి సాయినాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఁసాక్షిరూ.తో మాట్లాడుతూ, తమ అధినేత సూచనలు, సలహా మేరకు తమిళనాడులో సేవలను విస్తృతం చేస్తామన్నారు. అన్నదానం, రక్తదానం, పేదలకు ఉపయోగ పడే విధంగా సంక్షేమాల పంపిణీ, ఆశ్రమాల్లో సేవా కార్యక్రమాలను చేపట్టనున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement