ఆరోగ్యశ్రీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
హైదరాబాద్: ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు జరుగుతున్నాయి. అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు నిర్వహించిన ఆందోళనల్లో వైసీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.
గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి మోపిదేవి, మేరుగ నాగార్జున, ఎల్. అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పిన్నెల్లి డాక్టర్ గోపిరెడ్డి, ముస్తఫా, కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
కడప కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో జరిగిన ఆందోళనలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని.. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత‍్వం ఆరోగ్యశ్రీని నీరుగార‍్చుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు తదితర నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆరోగ్యశ్రీ పథకం అమలును మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, గొర్లె కిరణ్ కుమార్, తిలక్ తదితరులు పాల్గొన్నారు.
తూర్పోగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైఎస్‌ఆర్ సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో నేతలు కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ముత్తా శశిధర్, పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో నేతలు ఆళ్ల నాని, కారుమురి నాగేశ్వరరావు, బాలరాజు, మురళీరామకృష్ణ, కొటారు రామచంద్రారావు, నవీన్‌బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నిరుపేదలకు వైద్యం అందించలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. పేదరోగులకు వైఎస్‌ఆర్ సీపీ అండగా ఉంటుందన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఘనత చంద్రబాబుది అని ఆళ్ల నాని, కారుమురి నాగేశ్వరరావు విమర్శించారు.
నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో నేతలు కాకాని గోవర్దన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, సంజీవయ్య, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి పూర్తిస్థాయి నిధులు కేటాయించి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా నేతలు ఎండగట్టారు.
కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పార్టీ నేతలు గౌరు వెంకట్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌరు చరిత, కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాష్ రెడ్డి, బుడ్డా శేషారెడ్డి, బీవై రామయ్య, హఫీజ్ ఖాన్, మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం, కృష్ణా, అనంతపురం జిల్లాలలో సైతం ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరససగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ల వద్ద భారీ ఎత్తున ధర్నాలు జరిగాయి.