
అందులో మనోళ్లు టాప్!
న్యూఢిల్లీ: వాట్సాప్ వీడియో కాలింగ్‌లో మనోళ్లు ముందున్నారు. వీడియో కాల్ చేయడంలో అందరికంటే భారతీయులు ముందున్నారని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. వీడియో కాలింగ్‌లో ఇండియన్స్ ఎక్కువ సమయం నమోదు చేశారని వెల్లడించారు. ‘రోజుకు 50 మిలియన్లపైగా వీడియో కాలింగ్ మినిట్స్‌తో భారత్ టాప్‌లో ఉంద’ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 340 మిలియన్లపైగా వాట్సాప్ వీడియో కాలింగ్ మినిట్స్ నమోదవుతున్నాయి. ఇందులో అత్యధికం భారత్ నుంచి నమోదు కావడం విశేషం.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్‌లో 20 కోట్ల మందిపైగా ఈ యాప్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పటికీ భారతీయులు వీడియా కాలింగ్‌కు మొగ్గుచూపుతుండడం గమనార్హం. ఒక్క చాటింగ్ యాప్‌గానే కాకుండా బహుముఖంగా వాట్సాప్‌ను వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకు 1.2 బిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు.