గర్భం దాల్చిన కస్తూర్బా విద్యార్థిని | 10th class student pregnant in Kasturba | Sakshi
Sakshi News home page

గర్భం దాల్చిన కస్తూర్బా విద్యార్థిని

Published Wed, Dec 16 2015 12:26 AM | Last Updated on Fri, Nov 9 2018 4:32 PM

గర్భం దాల్చిన  కస్తూర్బా విద్యార్థిని - Sakshi

గర్భం దాల్చిన కస్తూర్బా విద్యార్థిని

- వంచించిన సమీప బంధువు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
 ములుగు:
కస్తూర్బా విద్యార్థినికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఓ కామాంధుడు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఆందోళనకు గురైన ఆమె సంబంధీకులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ములుగులో ఈ దారుణం వెలుగుచూసింది.  ఎస్‌ఐ సైదేశ్వర్ కథనం ప్రకారం.. జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బాలిక గజ్వేల్ కస్తూర్బాగాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.

దసరా సెలవుల్లో ములుగు మండలం మర్కుక్‌లో వున్న పెద్దమ్మ ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయిన బక్కనోల్ల బన్నీ (25) మాయమాటలతో బాలికను లోబరుచుకున్నాడు. అనంతరం పలుమార్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. కంగుతిన్న కుటుంబసభ్యులు నిలదీయడంతో బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాధితులు మంగళవారం రాత్రి ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బన్నీపై కేసు నమోదు చేసినట్లు ఎసై సైదేశ్వర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement