గోదావరి పుష్కర ఏర్పాట్ల నిమిత్తం రూ.13.48 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కర ఏర్పాట్ల నిమిత్తం రూ.13.48 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో ఐదు జిల్లాల్లో మొత్తం 174 పనులను చేపట్టాలని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న గ్రామీణ నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించింది. తాగునీటి సదుపాయం కోసం శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు, మరుగుదొడ్ల సదుపాయాలను పుష్కర ఘాట్ల వద్ద చేపట్టనున్నారు.