బలిపీఠంపై రైతన్నలు | 14 farmers' suicide | Sakshi
Sakshi News home page

బలిపీఠంపై రైతన్నలు

Published Sat, Oct 25 2014 12:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

బలిపీఠంపై రైతన్నలు - Sakshi

బలిపీఠంపై రైతన్నలు

14 మంది రైతుల ఆత్మహత్య
 
నెట్‌వర్క్: కాడి పట్టుకోవాల్సిన రైతు కాటికి వెళ్తున్నాడు. బ్యాంకు రుణం మాఫీ చేయాలని కలెక్టర్‌కు, బ్యాంకు అధికారులకు లేఖ రాసుకొని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు, మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు, నల్లగొండలో ఇద్దరు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఒకరు చొప్పున, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం శాభాష్‌పల్లికి చెందిన చంద్రగిరి ఉరఫ్ దార్‌కార్ రాజయ్య(49)  ట్రాక్టర్ లోన్‌కు సంబంధించి రూ.5.40 లక్షల అప్పు ఉంది. పత్తి   సాగుకు పెట్టుబడిగా రూ.లక్ష అప్పు తీసుకువచ్చాడు. అప్పులు తీరే మార్గం కానరాక  రాజయ్య  మనస్తాపంతో ఉరేసుకున్నాడు. కోనరావుపేట మం డలం పల్లిమక్తకు చెందిన రైతు ఎగంటి దేవయ్య(40) రూ.4 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించాడు. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన రైతు కొమ్ము లింగయ్య(48) తనకున్న 8 ఎకరాలకు తోడు మరో ఏడు ఎకరాలు కౌలు తీసుకొని పత్తి సాగు చేశా డు.

రూ. మూడు లక్షలు అప్పు చేశాడు. దిగుబడి వచ్చే అవకాశం లేక శుక్ర వారం ఆత్మహత్య చేసుకున్నాడు.  చందంపేట మండలం నేరడుగొమ్ము పరిధి చర్ల తండాకు చెందిన రైతు నేనావత్ చందు(40) పత్తి  వేసి నష్ట పోవ డంతో గురువారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన రైతు బొజ్జ భీమలింగం (43) ఎనిమిది ఎకరాల్లో సాగు చేశాడు. సాగుకు రూ.లక్ష వరకు, బంగారంపై బ్యాంకులో అప్పు, పంట రుణాలు, మరో రూ.2 లక్షలు ప్రైవేటు అప్పులు ఉన్నాయి. బుధవారంరాత్రి  క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన రైతు పెద్ద ఆంజనేయులు(60) మొక్కజొన్న, పత్తి పంట చేతికందకపోవడంతో గురువారం క్రిమిసంహారక మందు తాగాడు. వడ్దేపల్లి మండలం రాజోలికి చెందిన గళ్ల మద్దిలేటి(35) పంటలు దెబ్బ తినడంతో గురువారం పురుగుల మందు తాగాడు. తిమ్మాజీపేట మండలం పుల్లగిరికి చెందిన పెద్ద ఆంజనేయులు(60) పంట చేతికి వచ్చే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుమ్మరి గూడకు చెందిన కుమ్మరి సత్తయ్య(38) పత్తి సాగు చేస్తున్నాడు. రూ. 50 వేలు అప్పు చేశాడు. పంట ఎండిపోవడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. పరిగి మండలం సయ్యద్ పల్లికి చెందిన మల్లిగారి రామ స్వామి(40) ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఏడీబీ బ్యాంకు నుంచి రూ. 4 లక్షలు, ప్రైవేటుగా రూ. లక్ష అప్పు చేశాడు. గురువారం  పురుగుల మందుతా గాడు. వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్య(40) రెండు ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న  సాగు చేశాడు. రెండేళ్లుగా రూ.1.50 లక్షలు అప్పు చేశాడు. పంటలు పోవడంతో శుక్రవారం ఉరి వేసుకున్నాడు.  రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడికి చెందిన ఎండీ బురాన్(45) తనకున్న మూడెకరాల్లో మొక్కజొన్న, మరో పది ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, క్యారెట్, టమోటా, క్యాబేజీ సాగు చేస్తున్నాడు. పంటలు ఎండుముఖం పట్టడంతో మనోవేదనకు గురైన బురాన్ మంచంపట్టాడు.

వికారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటకు చెందిన రైతు మన్నె నరసింహులు(45),  ఖమ్మం జిల్లా పెదబండిరేవు గ్రామ రైతు పాయం సూరయ్య(87) తనకున్న కొద్దిపాటి భూమిలో పత్తి, వరి సాగు చేశా డు. పంట గురువారం ఇంట్లోనే గుళికలు మింగాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement